వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్దనగ్న ఫోటోలు షేర్ చేశారు, యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ మీద కేసు పెట్టిన మహిళ !

నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ చిక్కుల్లో పడ్డారు. 10 ఏళ్ల క్రితం యోగీ ఆదిత్యనాథ్, అసోం బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మలపై అసోంలోని బిస్వనాథ్ జిల్లాకు చెందిన.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ చిక్కుల్లో పడ్డారు. 10 ఏళ్ల క్రితం యోగీ ఆదిత్యనాథ్, అసోం బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మలపై అసోంలోని బిస్వనాథ్ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ కోర్టు తలుపుతట్టారు.

10 ఏళ్ల క్రితం తాను అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఆ ఫోటోలతో పాటు కామెంట్లు చేశారని అసోంకు చెందిన లక్ష్మీ ఒరాంగ్ అనే గిరిజన మహిళ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు.

గోహతిలో 2007లో !

గోహతిలో 2007లో !

2007లో గౌహతిలో గిరిజన మహిళలు ఆందోళన చేశారు. ఆ సందర్బంలో ఆందోళనకారుల మీద పోలీసులు విరుచుకుపడినట్లు ఆరోపణలు ఉన్నారు. ఆ సందర్బంలో అసోంలోని బిస్వనాథ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ లక్ష్మి ఒరాంగ్ అర్దనగ్నంగా ఉన్నారని సమాచారం.

సోషల్ మీడియాలో షేర్ చేశారు ?

సోషల్ మీడియాలో షేర్ చేశారు ?

తాను అర్దనగ్నంగా ఉన్న ఫోటోలను యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేసి అసభ్యంగా కామెంట్లు పెట్టారని లక్ష్మి ఒరాంగ్ ఆరోపిస్తున్నారు. 2007లోనే మొత్తం ఈ తతంగం మొత్తం జరిగిందని భాదితురాలు కోర్టును ఆశ్రయించింది.

ప్రధాని నరేంద్ర మోడీ !

ప్రధాని నరేంద్ర మోడీ !

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం భేటీ బచావో.... భేటీ పడావో అంటూ నినాదాలు చేస్తున్నారని, అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ గిరిజన మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయం అంటూ లక్ష్మి ఒరాంగ్ ప్రశ్నిస్తున్నారు.

యోగీ ఆదిత్యనాథ్ మీద !

యోగీ ఆదిత్యనాథ్ మీద !

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మల మీద ఐపీసీ, సైబర్ క్రైం తదితర సెక్షల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ కోర్టులో లక్ష్మి ఒరాంగ్ పిటిషన్ దాఖలు చేశారు.

అవును నిజమే, బీజేపీ ఎంపీ శర్మ

అవును నిజమే, బీజేపీ ఎంపీ శర్మ

అసోంలోని గిరిజన మహిళ లక్ష్మి ఒరాంగ్ చేస్తున్న ఆరోపణలపై ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ బాంబుపేల్చారు. అవును ఆ సందర్బంలో ఆరోపణలు చేస్తున్న గిరిజన మహిళ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి అని అంగీకరించారు. అయితే తాను అసభ్యంగా పోస్టులు మాత్రం పెట్టలేదని ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ అంటున్నారు.

English summary
Assam Tribal woman files case against Uttar Pradesh CM Yogi Adityanath, BJP MP Ram Prasad Sarma for sharing her nude image on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X