వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్ర ఘర్షణ: కాల్పుల్లో ఇద్దరు ఆక్రమణదారులు మృతి, చనిపోయినా దాడి, 9 మంది పోలీసులకు గాయాలు

|
Google Oneindia TeluguNews

గౌహతి: అస్సాంలోని డారంగ్ జిల్లాలోని ధోల్పూర్ గోరుఖుతి ప్రాంతంలో నిరసనకారులు(ఆక్రమణదారులు), పోలీసులకు మధ్య గురువారం తీవ్ర ఘర్షణ జరిగింది. పోలీసులపైకి నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రభుత్వ ఫామింగ్ ప్రాజెక్టు కోసం ఆక్రమణలకు పాల్పడినవారిని అక్కడ్నుంచి తరలించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అందుకు నిరాకరించిన ఆందోళనకారులు పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.

Assam: Two killed after encroachers clash with police during eviction drive.

దాడికి పాల్పడేందుకు వచ్చిన ఓ ఆందోళనకారుడ్ని పోలీసులు కాల్చి చంపారు. దాడికి పాల్పడ్డారు. ఓ కెమెరా మెన్ దిగ్బ్రాంతికరంగా కిందపడిపోయిన వ్యక్తిపై ఎగిరి తన్నాడు. చనిపోయిన తర్వాత కూడా దాడి చేశాడు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు అస్సాం ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

డారంగ్ జిల్లా ఎస్పీ సుశాంత్ బిశ్వ శర్మ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఆందోళనకారుల దాడుల్లో 9 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులకు గాయాలయ్యాయని తెలిపారు. వారిని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం వస్తుందన్నారు. గాయపడిన 9 మంది పోలీసులు కూడా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు.

ఈ కాల్పుల ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పోలీసుల కాల్పుల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ కాల్పులు జరిపేందుకు ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. ఏ భారతీయుడు కూడా ఇలాంటి పరిణామాలను స్వాగతించరని అన్నారు. అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఏపీసీసీ) అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం అమానుషమని అన్నారు.

కరోనా సమయంలో ఆక్రమణదారులను తరలించేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదని, కానీ, ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వశర్మ నాయకత్వంలోని అస్సాం ప్రభుత్వం మాత్రం అన్యాయంగా వ్యవహరిస్తోందని అన్నారు. నిరసనకారులంతా 1970 నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు కాంగ్రెస్ నేత భూపేన్ కుమార్ బోరా. నిరసనకారులను తరలించే ముందే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2016లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వీరంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పేదలైన వీరి సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారందరికి నివాసాలు ఏర్పాటు చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసనకారులపై ఇలా కాల్పులు జరగడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు. పోలీస్ రాజ్యంగా మార్చొద్దని రాష్ట్ర కాంగ్రెస్.. బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆల్ అస్సాం మైనార్టీస్ స్టుండెంట్స్ యూనియన్ తోపాటు పలు సంస్థలు పోలీసు కాల్పులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.

Recommended Video

Ahead of boxer Lovlina final bout construction work is underway on the road at Golaghat

ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న కారణంగానే వారిని అక్కడ్నుంచి పంపించివేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న 800 కుటుంబాల్లో మెజార్టీ ప్రజలు తూర్పు బంగ్లాదేశ్‌కు చెందినవారు కావడం గమనార్హం. జూన్ నెల నుంచి ఆక్రమణదారులను ఖాళీ చేసే కార్యక్రమం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 49 ముస్లిం కుటుంబాలను, ఒక హిందూ కుటుంబాన్ని అక్కడ్నుంచి తరలించారు. అక్రమవలసదారులంతా అక్కడ ఉన్న చారిత్రక శివాలయంకు చెందిన భూములను కూడా ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఆక్రమణకు పాల్పడినవారి మొదటి తరలింపు తర్వాత సీఎం హిమంత బిశ్వశర్మ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఆక్రమణలకు పాల్పడినవారందరినీ ఇక్కడ్నుంచి తరలించాలని ఆదేశించారు.

English summary
Assam: Two killed after encroachers clash with police during eviction drive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X