వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేడీ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ పై హత్యాయత్నం: అర్దరాత్రి తెగించి !

ఉడిపి జిల్లాలో ఇసుక మాఫియా ముఠా సభ్యులు ఆ జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్ లను ఆదివారం అర్దరాతి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. ఇసుక దందాను అడ్డుకుం

|
Google Oneindia TeluguNews

ఉడిపి/బెంగళూరు: అక్రమ ఇసుక దందాను అడ్డుకోవడానికి వెళ్లిన లేడీ కలెక్టర్, లేడీ అసిస్టెంట్ కలెకట్టర్ పై హత్యాయత్నం చేసిన ఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర సమీపంలోని కడ్లూరులో ఆదివారం అర్దరాత్రి జరిగింది.

ఇసుక మాఫియా ముఠా సభ్యుల నుంచి తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన ఇద్దరు మహిళా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉడిపి జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఉడిపి జిల్లా ఎస్పీ కే.టీ. బాలక్రిష్ణ మీడియాకు చెప్పారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఉడిపి జిల్లా ఎస్పీ కే.టీ. బాలక్రిష్ణ అన్నారు. ఉడిపి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అడ్డుకోవడానికి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.

Assault attempt on Udupi DC Priyanka by sand mafia members on Sunday night at Kadlur.

ఆదివారం అర్దరాత్రి ఉడిపి జిల్లాలోని కుందాపుర సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తన్నారని జిల్లా కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ కు సమాచారం అందింది. వెంటనే కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్, స్థానిక రెవెన్యూ శాఖ అధికారులను వెంట పెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితులు వీరి మీద దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 13 మందిని అరెస్టుట చేసి మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
Assault attempt was made on Udupi DC Priyanka and AC Shilpa Nag by sand mafia members on Sunday night at Kadlur, Udupi district. In relation to the case so far 13 people were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X