వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల ఫలితాల వేళ.. విదేశంలో సోనియాగాంధీ! అసలేమైంది?

ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ (శనివారం) తేదీన వెల్లడికానుండగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలో ఉండడం లేదు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11వ (శనివారం) తేదీన వెల్లడికానుండగా, ఓట్ల లెక్కింపు సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశంలో ఉండడం లేదు.

అనారోగ్య కారణాల వల్ల వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం సోనియా గత మంగళవారమే విదేశాలకు బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. ఆమె ఈనెల 22వ తేదీన తిరిగి రానున్నట్లు సమాచారం.

ఎన్నికల ప్రచారంలో వారణాసి రోడ్ షోలో పాల్గొన్న సోనియా అనారోగ్యానికి గురయ్యారు. ఢిల్లీలో చికిత్స తీసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలకు కూడా ఆమె సరిగ్గా హాజరుకావడం లేదు.

Assembly Elections 2017: As Crucial Results Come In, Sonia Gandhi Abroad, Puts Son Rahul Gandhi In Charge

అనారోగ్యంతో గతంలో అమెరికాలో చికిత్స చేయించుకున్న సోనియాగాంధీ ప్రస్తుతం యూకే వెళ్లినట్లు తెలుస్తోంది. సోనియా తరుపున ఆమె కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఎంపీలతో రాహుల్ రేపు సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. 11న వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో గనక కాంగ్రెస్ ఓటమి చవిచూస్తే.. రాహుల్ గాంధీ నాయకత్వంపై మరోమారు ప్రశ్నలు తలెత్తే అవకాశముంది. అదేగనుక జరిగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధి కోసం ప్రియాంకగాంధీ నడుం బిగించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

English summary
NEW DELHI: When results from five states including Uttar Pradesh are counted on Saturday, Congress President Sonia Gandhi will not be in the country. She is abroad for medical tests and treatment, said sources in her party, without divulging more information. Mrs Gandhi, 70, left the country on Tuesday and is expected to return on the 22nd, subject to her doctors' advice. In 2011, she was allegedly operated on in the US, but her party refused to provide details of her condition, saying only that she was being treated in America. In August last year, she fell ill during a road show in Prime Minister Narendra Modi's constituency of Varanasi, and was then hospitalized in Delhi, after which her attendance in parliament has been irregular.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X