• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

బెంగాల్ పోల్స్: కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో కాల్పులు..నలుగురు మృతి పలువురికి గాయాలు

|

బెంగాల్ నాల్గవ దశ పోలింగ్ ముగిసింది. మొత్తం 44 అపెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటలకు ముగిసింది. కూచ్‌బెహార్ జిల్లాలోని సీతల్‌కుచ్ ‌లో స్థానికులపై కేంద్రబలగాలు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై స్థానికులు దాడిచేశారు. అదే సమయంలో మీడియా వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలతో బెంగాల్ నాల్గవ దశ పోలింగ్‌ కాస్త హింసాత్మకంగా మారింది.

assembly-elections-2021-live-updates-west-bengal-tamil-nadu-kerala-assam-puducherry-election-news

నాల్గవ దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ఇందులో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, బాలీవుడ్ సింగర్ బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ, పాయల్ సర్కార్ మరియు మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీలు ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ నాల్గవ దశ పోలింగ్‌కు సంబంధించి మినిట్-టూ మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Newest First Oldest First
6:30 PM, 10 Apr
కూచ్‌బెహార్ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించిన మమతా బెనర్జీ. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్
6:26 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్‌లో ప్రశాంత్ కిషోర్ ఆడియో క్లిప్పులు కలకలం. టీఎంసీ ఓటమికి దగ్గరలో ఉంది అందుకే ప్రశాంత్ కిషోర్ ఆ మాటలు మాట్లాడారు: బీజేపీ నేత అమిత్ మాలవ్య
6:19 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
సీతల్‌కుచ్ ఘటనపై జుడీషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేసిన సీపీఐ
6:18 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్‌లో హింసకు ఈసీ బాధ్యత వహించాలి: చిదంబరం
6:16 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
సాయంత్రం 5 గంటల సమయానికి కూచ్‌బెహార్‌లో 76శాతం పోలింగ్ నమోదు
5:49 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
మరికాసేపట్లో ముగియనున్న పోలింగ్. సాయంత్రం 6 గంటల్లోగ ఎవరైతే క్యూలైన్లలో నిల్చున్నారో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్న ఈసీ
5:20 PM, 10 Apr
హింసాత్మక ఘటనలతో పోలింగ్ రద్దయిన కూచ్ బెహార్ జిల్లాలోని సీతల్‌కుచి ప్రాంతంలో రేపు మమతా బెనర్జీ పర్యటించనున్నారు.
4:51 PM, 10 Apr
భద్రతా బలగాలపై కేంద్ర హోంశాఖ ప్రభావం ఉంది. ఈ విషయం మేము ముందు నుంచే చెప్తున్నాం. మా అనుమానాలే ఇప్పుడు నిజమయ్యాయి.-మమతా బెనర్జీ
4:39 PM, 10 Apr
కూచ్ బెహార్‌లో కాల్పులకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి : మమతా బెనర్జీ
4:16 PM, 10 Apr
దాదాపు 300 నుంచి 350 మంది మూక ఒక్కసారిగా సీఐఎస్ఎఫ్‌ భద్రతా బలగాలపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులకు పాల్పడాల్సి వచ్చింది. కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.-కూచ్ బెహార్ ఎస్పీ
4:04 PM, 10 Apr
కూచ్‌బెహార్ ఫైరింగ్‌పై ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన టీఎంసీ బృందం
3:44 PM, 10 Apr
ఓటర్లపై కేంద్ర బలగాలు కాల్పులు జరిపి నలుగురి మరణానికి కారణం అవడం దురదృష్టకరం: సీతారాం ఏచూరి
3:44 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
సిలిగురిలో సాయంత్రం 5 గంటలకు మమతా బెనర్జీ మీడియా సమావేశం
3:20 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
కూచ్‌బెహార్ జిల్లా సీతల్‌కుచ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 126లో పోలింగ్ నిలిపివేసినట్లు ప్రకటించిన అధికారులు
2:50 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్‌లో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్.ఒకటి రెండు చోట్ల ఘర్షణ వాతావరణం
2:28 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
24 పారగానాస్ సౌత్‌ జిల్లాలోని బెహాలాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
2:11 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
కేంద్రబలగాలు కాల్పులు జరిపేందుకు ఎవరు అనుమతిచ్చారు. అది కూడా సామాన్య ఓటర్లపై కాల్పులు జరపడమనేది అత్యంత అమానూషమైన చర్య: టీఎంసీ ఎంపీ సుగతా రాయ్
1:46 PM, 10 Apr
కూచ్‌బెహార్ కాల్పుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న దీదీ. రేపు కూచ్‌బెహార్‌కు దీదీ
1:45 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి 52.89శాతం పోలింగ్ నమోదు
1:12 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
సీఆర్‌పీఎఫ్ జవాన్లు నలుగురిని కాల్చి చంపారు.సీఆర్‌పీఎఫ్ నాకు శతృవు కాదు. అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఏదో కుట్ర జరుగుతోంది: సీఎం మమతా బెనర్జీ
12:55 PM, 10 Apr
అస్సాం
అస్సాంలో 4 పోలింగ్ కేంద్రాల్లో ఏప్రిల్ 20న రీపోలింగ్.రతబారి,సోనాయ్,హాఫ్లాంగ్ ఏప్రిల్ 1వ తేదీన ఇక్కడ పోలింగ్ జరిగింది
12:51 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
కూచ్‌బెహార్‌లో పోలింగ్ సందర్భంగా నలుగురు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోడీ
12:05 PM, 10 Apr
పశ్చిమ బెంగాల్
ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఛైర్మెన్ మరియు భంగార్ అభ్యర్థి నౌషద్ సిద్ధిఖీ, బీజేపీ అభ్యర్థి సౌమీ హాతీ పరస్పర అభివాదం
11:35 AM, 10 Apr
బెంగాల్ పోల్స్: కూచ్‌బెహార్‌లోని సీతల్‌కుచిలో కాల్పులు..నలుగురు మృతి పలువురికి గాయాలు
11:12 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
హుగ్లీలో తనపై స్థానికులు దాడి చేశారంటూ ఫోన్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసిన అభ్యర్థి లాకెట్ ఛటర్జీ
11:09 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
వృద్ధులకు పోలింగ్ కేంద్రానికి చేర్చేందుకు సహాయపడుతున్న ఐటీబీపీ సిబ్బంది
10:46 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత. టీఎంసీ శవపేటికపై చివరి మేకును కొట్టారు ప్రశాంత్ కిషోర్: కూచ్‌బెహార్ ఎంపీ నిశిత్ ప్రామాణిక్
10:45 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్ ఎన్నికల సందర్భంగా హుగ్లీలో దారుణం. మీడియా వాహనాలను ధ్వంసం చేసిన స్థానికులు
10:44 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
హుగ్లీలో బీజేపీ నేత లాకెట్ ఛటర్జీపై స్థానికుల దాడి
10:11 AM, 10 Apr
పశ్చిమ బెంగాల్
బెంగాల్‌లో ఉదయం 9:30 గంటల సమయానికి 15.85శాతం పోలింగ్ నమోదు
READ MORE

English summary
First phase of assembly elections for Assam, West Bengal will be held on 27th March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X