వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో కలవరం: మూడు రాష్ట్రాల్లో ఎక్కడ నష్టపోయిందంటే?.. నిపుణుల మాట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో బీజేపీ అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. కచ్చితంగా గెలుస్తుందనుకున్న ఛత్తీస్‌గఢ్‌లో పరాయజం పాలైంది. బీజేపీ దారుణంగా ఓడిపోతుందనుకున్న రాజస్థాన్‌లో కాంగ్రెస్ అత్తెసరు సంఖ్యతో గట్టెక్కింది. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంటుంది.

కానీ ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీకి దెబ్బపడినట్లుగా తెలుస్తోంది. పట్ణణ ప్రాంతాల్లోను భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ తగ్గింది. దీనికి ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉండటమే కారణంగా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారంలో ఉంది. నాలుగోసారి ఓడింది.

అదే జరిగితే ఫలితం తారుమారు!: మధ్యప్రదేశ్‌లో బీజేపీని నోటా ఎలా దెబ్బతీసిందంటే?అదే జరిగితే ఫలితం తారుమారు!: మధ్యప్రదేశ్‌లో బీజేపీని నోటా ఎలా దెబ్బతీసిందంటే?

బీజేపీ గతంలో, ఇప్పుడు ఎలా గెలిచిందంటే

బీజేపీ గతంలో, ఇప్పుడు ఎలా గెలిచిందంటే

2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్‌గఢ్‌లో 60 సీట్లకుగాను 49, రాజస్థాన్‌లో 200 సీట్లకు గాను 163, మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకు గాను 165 స్థానాల్లో గెలిచింది. సాధారణంగా హిందీ బెల్ట్‌లో బీజేపీకి పట్టు ఎక్కువ. మూడు రాష్ట్రాల్లో ఓడినప్పటికీ లెక్కలు వేరే రకంగా ఉన్నాయి. రాజస్థాన్‌లో గత మూడు దశాబ్దాలుగా ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ నాలుగోసారి పోటీలో గట్టిగానే నిలబడింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ కూడా రాలేదు.

మూడు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో గెలుపు

మూడు రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో గెలుపు


ఈ మూడు రాష్ట్రాల్లో 65 లోకసభ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉండటం దానికి తోడు నరేంద్ర మోడీ హవా కారణంగా 2014 లోకసభ ఎన్నికల్లో ఇందులోని 62 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం బీజేపీకి మైనస్ అవుతుంది. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సందీప్ శాస్త్రి మాట్లాడుతూ... బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో క్రమంగా ప్రభావం తగ్గుతోందని, అలాగే పట్టణ ప్రాంతాల్లోను జరుగుతోందని చెప్పారు. అయితే ఈ మూడు రాష్ట్రాలు కూడా ఎక్కువగా గ్రామీణ జనాభా ఉన్న రాష్ట్రాలు. కాబట్టి బీజేపీకి ఒకేసారి మూడు రాష్ట్రాల్లో నష్టం జరగడం ఎక్కువగా కనిపిస్తోందని చెప్పారు. గుజరాత్ వంటి చోట్ల అర్బన్ పాపులేషన్ ఇక్కడి కండే ఎక్కువ అన్నారు.

అదే బీజేపీకి కలవరం

అదే బీజేపీకి కలవరం

ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా ఉంటుందని, రైతులు ఎక్కువ అని డాక్టర్ శాస్త్రి చెప్పారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో రైతుల ఆందోళన తెలిసిందే. దీని వల్ల ఎక్కువ నష్టం జరిగింది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు దూరం జరగడం కలవరపాటు కలిగించే అంశమని ఆయన అన్నారు. 2013లో ఇక్కడి రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ ప్రాబల్యం చూపింది. కానీ ఇప్పుడు అది తగ్గిందని చెప్పారు.

పట్టణ ప్రాంతాల్లో బీజేపీ సీట్లు తగ్గాయి

పట్టణ ప్రాంతాల్లో బీజేపీ సీట్లు తగ్గాయి

మధ్యప్రదేశ్‌లో బీజేపీ పట్టణ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈసారి బీజేపీ సీట్లు బాగా తగ్గాయని డాక్టర్ శాస్త్రి తెలిపారు. అర్బన్ ప్రాంతంలోని 2013లో బీజేపీ 90 శాతం సీట్లు గెలవగా, ఈసారి అది 55 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 2013లో 75 శాతం సీట్లను పట్టణ ప్రాంతాల్లో గెలవగా, ఈసారి 25 శాతానికి పడిపోయిందని తెలిపారు. రాజస్థాన్‌లో 2013లో బీజేపీ 95 శాతం సీట్లను అర్బన్ ప్రాంతంలో దక్కించుకుందని, ఈసారి మాత్రం 63 శాతానికి పడిపోయిందని చెప్పారు. బీజేపీకి గ్రామీణం కంటే పట్టణ బలం ఎక్కువ. కానీ అక్కడ క్రమంగా బలం కోల్పోతుందని చెబుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే 2014లా బీజేపీకి 2019 లోకసభ ఎన్నికలు ఏమంత సులంభం కాదని అర్థమవుతోందని చెబుతున్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో బలపడాల్సి ఉంది.

English summary
While analysing the BJP's loss in the three states of Madhya Pradesh, Rajasthan and Chhattisgarh, many have pointed towards the party's poor performance in the rural areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X