వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: ఆస్తమా ఉన్నవారికి వైరస్ ప్రభావం తక్కువే, పొగతాగేవారికి కూడా: అధ్యయనం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ వస్తోందన్న ఊహాగానాలతో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో వైరస్ గురించి మరో విస్తుగొలిపే విషయం బయటపడింది. వాస్తవానికి వైరస్ శీతాకాలంలో ఎక్కువగా ప్రబలుతోంది. దీంతోపాటు ఆస్తామా ఉన్నవారు జర భద్రం అని వైద్యులు సజెస్ట్ చేశారు. కానీ కొత్తగా చేసిన అధ్యయనం దీనిని పటాపంచలు చేసింది.

తక్కువ.. ఎందుకంటే...

తక్కువ.. ఎందుకంటే...

ఆస్తామా రోగులకు కరోనా వైరస్ ప్రబలే అవకాశం చాలా తక్కువ అని తెలిపింది. వినడానికి ఇబ్బందిగా ఉన్న ఇదీ నిజం. ఇప్పటికే తాము ఆస్తామా ఉన్న రోగులను పరిశీలించామని అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ గతనెల 24వ తేదీన ప్రచురించిన జర్నల్‌లో పేర్కొన్నది. అయితే దీనికి సంబంధించి మరింత అధ్యయనం చేయాల్సి ఉంది అని తెలిపింది.

యూదులు, అరబ్‌లు..

యూదులు, అరబ్‌లు..

ఆస్తమా ఉన్న రోగులను పరిశీలించారు. ఇజ్రాయెల్‌‌ ఆరోగ్య నిర్వహణ సంస్థ నుంచి డేటా తీసుకున్నారు. ఇందులో యూదు, అరబ్‌కు చెందిన వారు ఉన్నారు. ఫిబ్రవరి 2020 నుంచి జూన్ వరకు కరోనా వైరస్ టెస్ట్ చేసిన వారిని అధ్యయనం చేశామని వివరించారు. 37 వేల 469 మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేశారు. వీరిలో 2 వేల 266 అంటే 6.05 శాతం మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారు 153 ఆస్తమా రోగులు ఉంటే.. 3 వేల 388 మందికి నెగిటివ్ వచ్చింది.

Recommended Video

GHMC Elections 2020 : Revanth Reddy Satires On BJP & TRS | Oneindia Telugu
 పొగతాగేవారికి కూడా

పొగతాగేవారికి కూడా

దీనిని బట్టి ఆస్తమా ఉన్నవారికి వైరస్ ప్రభావం చాలా తక్కువ చూపిస్తోందని నిర్ధారణ అయ్యింది. దీంతోపాటు కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కంటే.. నెగిటివ్ వచ్చిన వారు ఎక్కువ స్మోకింగ్ చేస్తారనే విషయం తెలిసింది. అంతేకాదు సిగరేట్ తాగేవారిలో కూడా వైరస్ సోకదని దీనిని బట్టి తెలుస్తోంది.

English summary
recent research reveals that people with asthma may be at a reduced risk of contracting Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X