వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూంలో టెక్కీకి ఆస్ట్రాలజర్ లైంగిక వేధింపు, తెలివిగా...

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఓ ఆస్ట్రాలజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళా టెక్కీని లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలతో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్న 25 ఏళ్ల యువతిని అతను వేధిస్తున్నాడు.

బాధితురాలు పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి. ఆమె గత ఇరవై నెలలుగా సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ... నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. బాధితురాలు బుధవారం నాడు హోసల నగర్‌లో ఉండే ఆస్ట్రాలజర్ వద్దకు వెళ్లారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లారు.

తన పెళ్లి గురించి అడిగేందుకు ఆమె సదరు ఆస్ట్రాలజర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో లోనికి వెళ్లిన తనకు తీర్థం అంటూ నీళ్లు ఇచ్చి.. తనను హిప్నటైజ్ చేసి లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు. ఆ సమయంలో అక్కడ ఆస్ట్రాలజర్ తప్ప మరొకరు లేరని చెప్పారు.

Astrologer arrested for harassing techie

తనతో పాటు వచ్చిన స్నేహితుడిని బయటే ఉంచాడని, తనను మాత్రం ఇంటి లోపలకు తీసుకు వెళ్లి, లోపల గడియ వేశాడని చెప్పారు. తాను దాదాపు మూడు గంటల పాటు ఆ ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. మొదటి గంట పాటు ఆయన తన గురించి చెప్పినవి బాగానే ఉన్నాయని తెలిపారు.

తాను ఆయన మాటలను నమ్ముతున్నానని క్రమంగా తెలుసుకున్న అతను ఒక్కసారిగా తాను దిగ్భ్రాంతికి లోనయ్యేలా వ్యవహరించారని తెలిపారు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో.. తాను మరుసటి రోజు తప్పకుండా వస్తానని అతనికి చెప్పి, అక్కడి నుండి బయట పడ్డానని తెలిపారు.

తాను వెంటనే బయటకు వెళ్లి లోపల జరిగిన విషయాన్ని, బయట నిలుచుకున్న తన స్నేహితుడితో చెప్పానని తెలిపారు. అక్కడి నుండి తాము వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించి, అతనిని అరెస్టు చేశారన్నారు.

English summary
An astrologer in Hoysala Nagar, Bengaluru was arrested for allegedly sexually harassing a 25-year-old techie working for a global IT giant in Electronics City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X