బిపిన్ రావత్ మరణాన్ని ఏడాది ముందే పసిగట్టిన జ్యోతిష్కురాలు: హైప్రొఫైల్ కేంద్రమంత్రికీ మృత్యుగండం
బెంగళూరు: తమిళనాడులోని సుళ్లూరు-కూనూర్ మధ్య సైనిక హెలికాప్టర్ కుప్పకూలడం వల్ల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్.. ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది దుర్మరణం పాలైన ఘటన గురించి జ్యోతిష్కులు ఏం చెబుతున్నారు?.. ఈ దుర్ఘటన సంభవిస్తుందని వారు ముందే పసిగట్టారా?.. ఓ ఆర్మీ ఉన్నతాధికారి హఠాన్మరణానికి గురవుతారని ముందే హెచ్చరించారా?.. అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ముందే అంచనా..
బెంగళూరుకు
చెందిన
ప్రముఖ
జ్యోతిష్కురాలు
గాయత్రిదేవి
వాసుదేవ్..
ఈ
ప్రమాదాన్ని
ముందే
పసిగట్టారు.
ఈ
ఏడాది
చివరలో
రెండు
ఘోర
ప్రమాదాలు
సంభవిస్తాయని
లిఖిత
పూరకంగా
హెచ్చరించారు.
ఓ
ఆస్ట్రాలజీ
మేగజైన్లో
దీనికి
సంబంధించిన
ఓ
ప్రత్యేక
కథనాన్ని
ప్రచురించారు.
ఈ
రెండు
దుర్ఘటనల్లో
ఆర్మీ
ఉన్నతాధికారుల్లో
ఒకరు,
హై
ప్రొఫైల్
కేటగిరీకి
చెందిన
కేంద్రమంత్రి
ఒకరు
కన్నుమూస్తారని
అంచనా
వేశారు.
ఇప్పుడీ
మేగజైన్
క్లిప్..
సంచలనంగా
మారింది.

మోడర్న్ ఆస్ట్రాలజీ..
మోడర్న్ ఆస్ట్రాలజీ అనే మేగజైన్లో గాయత్రిదేవి వాసుదేవ్ ఈ కథనాన్ని రాశారు. ఈ ఏడాది జనవరిలో ఇది పబ్లిష్ అయింది. 2020 నవంబర్లోనే ఆమె దీన్ని రాశారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు, నేరాలు భారీగా చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఇతర హై ప్రొఫైల్ కేబినెట్ మంత్రుల సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. మోడీ జాతకాన్ని కుజగ్రహం, రాహువు నియంత్రిస్తున్నాయని, ఏడాది చివరిలో కనీసం రెండు హింసాత్మక లేదా దుర్ఘటనలు సంభవిస్తాయని పేర్కొన్నారు.

జులై నుంచి
జూలై
25,
2021న
అనూరాధ
నక్షత్రంలోకి
కేతువు
ప్రవేశించిందని,
మే
26,
డిసెంబర్
4వ
తేదీ
నాడు
సంభవించే
సూర్య,
చంద్ర
గ్రహణాల
ప్రభావం
తీవ్రంగా
ఉంటుందని
పేర్కొన్నారు.
డిసెంబర్
14వ
తేదీన
అంటే
ఈ
మంగళవారం..
కుజగ్రహం-రాహువు
పరస్పరం
సంయోగం
చెందుతాయని,
ఇది
ఎంత
మాత్రం
మంచిది
కాదని
అభిప్రాయపడ్డారు.
కుజుడు-రాహువు
సంయోగం
చెందే
డిసెంబర్
14వ
తేదీన
కూడా
కొన్ని
అవాంఛనీయ
సంఘటనలు,
హింసాత్మక
పరిస్థితులు
తలెత్తే
అవకాశాలు
లేకపోలేదని
అంచనా
వేశారు.

ఉగ్రవాదుల దాడికి ఛాన్స్..
ఈ
ఏడాది
జులై
1వ
తేదీన
కుజుడు-శని,
అదే
నెల
29వ
తేదీన
కుజగ్రహం-బృహస్పతి
ఇదే
తరహాలో
అభిముఖంగా
వచ్చాయని,
డిసెంబర్
14వ
తేదీన
కుజుడు-రాహువు
సంయోగం
చెందడం..
అభిముఖంగా
ఏర్పడటం
జ్యోతిష్యపరంగా
సత్
సంకేతాలు
కావని
గాయత్రిదేవి
వాసుదేవ్
స్పష్టం
చేశారు.
ఈ
సమయంలో
భారీగా
హింసాత్మక
పరిస్థితులు
సంభవించే
ప్రమాదం
లేకపోలేదని,
అవి
ఉగ్రవాద
దాడులు
కూడా
కావొచ్చని
అన్నారు.

ఎవరీ గాయత్రీదేవి వాసుదేవ్..
గాయత్రీదేవి వాసుదేవ్.. బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్కురాలు. బెంగళూరు యూనివర్శిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. ఆమె తండ్రి బీవీ రామన్ కూడా జ్యోతిష్కుడే. మోడర్న్ ఆస్ట్రలాజికల్ అనే మంత్లీ మేగజైన్‌ను ఆయనే స్థాపించారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఆమె వేసిన కొన్ని అంచనాలు నిజం అయ్యాయి. ఇదివరకు గుజరాత్ భూకంపం, ఎల్టీటీఈ ప్రభాకరన్ అసాసినేషన్, సునామీ వంటి ఉదంతాలను అంచనా వేయగలిగారు. వాటి గురించి ముందే హెచ్చరించారు. తాజాగా బిపిన్ రావత్ మరణాన్ని కూడా ముందే పసిగట్టారు. డిసెంబర్ 14వ తేదీన సంభవించే అవకాశం ఉందంటూ ఆమె వేసిన అంచనాలు నిజం అవుతాయా? లేదా? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.