వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: కమల్ హాసన్ కనీసం మంత్రి కూడా కాలేరట! ఇది జ్యోతిషుల మాట..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజకీయ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన దశ బాగుందని.. కచ్చితంగా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠిస్తారని కొంతమంది జ్యోతిషులు చెబుతుంటే, మరికొంతమంది మాత్రం ఆయన కనీసం మంత్రి కూడా కాలేరని బల్లగుద్దిమరీ వాదిస్తున్నారు.

Recommended Video

Kamal Hassan Party 'Makkal Needhi Maiam': What Does It Mean?

నటుడు కమల్‌హాసన్ 'మక్కల్ నీధి మయ్యమ్' పేరుతో పార్టీని స్థాపించి, రాజకీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కంటే కమల్ ఒకడుగు ముందే ఉన్నారు. అయితే మరోవైపు కమల్ రాజకీయ భవిష్యత్తుపై పలువురు జ్యోతిషులు పలురకాలుగా చెబుతున్నారు.

కమల్‌కు ఉజ్వల రాజకీయ భవిష్యత్తు...

కమల్‌కు ఉజ్వల రాజకీయ భవిష్యత్తు...

కమల్ హాసన్‌కు ఉజ్వల రాజకీయ భవితవ్యం ఉన్నట్లు ఢిల్లీకి చెందిన జ్యోతిషుడు ఒకరు పేర్కొన్నారు. ఆయన పూర్తిగా ప్రజాసేవకే అంకితమవుతారని చెప్పారు. మరో తమిళ జ్యోతిషుడు రధన్ పండిట్ అయితే.. కమల్ జాతకాన్ని దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రాంచంద్రన్ జాతకంతో పోల్చారు. ఆయన రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైందని, నిరాటంకంగా 20-25 ఏళ్లపాటు ఆయన క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతారని రధన్ పండిట్ పేర్కొన్నారు. అంతేకాదు, డీఎంకే స్టాలిన్‌ జాతకం కూడా ఉచ్ఛస్థితిలో ఉందంటూ, అయినగానీ కమల్ హాసన్‌కు ఎదురే ఉండదని, రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి అవడం తథ్యమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం కమల్ హాసన్ వయసు 63 ఏళ్లు. ఆయన 90 ఏళ్లు జీవిస్తారని, 2036 వరకు ఆయన జాతకం ఉజ్వలంగా ఉంటుందని రధన్ పండిట్ చెబుతున్నారు.

కమల్‌కు అన్నీ అనుకూలమే, కానీ...

కమల్‌కు అన్నీ అనుకూలమే, కానీ...

మరో జ్యోతిషుడు భారతి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రస్తుతం కమల్ హాసన్ బుధ మహాదశ నుంచి శుక్ర మహాదశలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ దశ అక్టోబరు 2020 వరకు ఉంటుంది. నటుడిగా ఆయన ఇప్పటికే కావాల్సినంత పేరు సంపాదించుకున్నారు. కాబట్టి గ్రహబలం ప్రకారం అదనంగా ఎలాంటి లబ్ది ఉండదు. ఈ సమయంలో కుజుడు ఉచ్ఛదశలో ఉంటాడు కాబట్టి కమల్‌కు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంగారకుడి స్థానంలో బుధుడు ఉండటం వల్ల మిశ్రమ ఫలితాలు చేకూరుతాయి. అయితే రాజకీయాలు మాత్రం కమల్‌హసన్‌కు కలిసిరాకపోవచ్చని జ్యోతిషుడు భారతి శ్రీధర్ పేర్కొంటున్నారు.

మంత్రి అయ్యే చాన్స్ కూడా లేదా?

మంత్రి అయ్యే చాన్స్ కూడా లేదా?

కమల్ హాసన్ జాతకంలో నవంబరు 2020 నుంచి మొదలయ్యే సూర్య మహాదశ ఆరేళ్లపాటు ఉంటుంది. అయితే ఈ కాలంలో సూర్యుడు బలహీనుడే కాకుండా శనితో కలిసి ఉంటాడు. అందువల్ల కమల్‌కు పెద్దగా కలిసిరాదట. రాజకీయాల్లోనే కాదు, ఒకవేళ సినిమాల్లో నటించాలనుకున్నా కూడా ఆయనకు ఆ రంగంలోనూ అంతగా కలిసిరాదట. రాశిచక్రం ప్రకారం గురుడు ఉచ్చస్థితిలో ఉన్నా, 10 వ స్థానంలో ఉండటంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, పదవులు మాత్రం దక్కవట. ఒకవేళ భాగ్యస్థానం ప్రకారం సూర్య, కేతువులతో బుధుడు కలిసినప్పుడు జనాదరణ పొందినా కానీ ప్రతినిధి మాత్రం కాలేడట. మొత్తంగా చెప్పాలంటే కమల్ జాతకంలో ముఖ్యమంత్రి యోగం కాదుగదా.. కనీసం ఆయన మంత్రి అయ్యే అవకాశం కూడా లేదని చెబుతున్నారు.

ఫెంగ్‌ షుయ్‌లో చూసినా కూడా...

ఫెంగ్‌ షుయ్‌లో చూసినా కూడా...

మన జ్యోతిష శాస్త్రం ప్రకారమే కాదు, చైనా జ్యోతిషమైన ఫెంగ్ షుయ్ ప్రకారం చూసుకున్నా కమల్ హాసన్‌ రాజకీయాల్లో రాణించడం కష్టమేనట. ఈ విషయాన్ని ఫెంగ్ షుయ్ కన్సల్టెంట్ ఎస్‌బీఎస్ సురేందరన్ వెల్లడించారు. గణితశాస్త్రం ప్రకారం వృత్తం, దానిలో ఆరు కోణాల నక్షత్రం శక్తి, జ్ఞానం, ఘనత, ప్రేమ, దయ, న్యాయం అనే గుణాలకు ప్రతీక. కమల్ జాతకంలోని ఎరుపు రంగు అగ్నిని సూచిస్తోందని, దీని ప్రభావం సమృద్ధి, కీర్తి, ఆనందం, బంధాలపై ఉంటుందని, ఇక తెలుపు అనేది లోహ మూలకం.. సృజనాత్మకత, ప్రజలకు సహాయపడటం, పనిలో నిబద్దతను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. నలుపు అనేది నీటి మూలకమని, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలకు ఇదే కారణమవుతుందని, పై ఆరు గుణాలు, మూడు రంగుల సమన్వయంతో కలిసి ఏకకాలంలో పనిచేసినప్పుడు మాత్రమే మంచి ఫలితం ఉంటుందని, కానీ కమల్‌‌హసన్‌కు మాత్రం వీటి సమన్వయం చాలా తక్కువగా ఉందని, కాబట్టి ఆయన రాజకీయాల్లో రాణించడం కష్టమని ఫెంగ్ షుయ్ కన్సల్టెంట్ సురేందరన్ చెబుతున్నారు.

English summary
According to a Delhi-based astrologer, Tamil Superstar Kamal Haasan has a bright political future, provided he completely commits himself to public service. Radhan Pandit, the Tamil astrologer, says actor Kamal Hassan's horoscope has similarities with the horoscope of late Tamil Nadu chief minister MG Ramachandran. And that Kamal's great run has just begun. With health providing support, Kamal can continue for 20-25 years in politics. As far as DMK president MK Stalin is concerned, he too has a spectacular future in Tamil Nadu politics. However, Radhan Pandit said Kamal can overtake Stalin, and could become CM of Tamil Nadu in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X