వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై భారత్ పట్టు -16గంటల పాటు పదో రౌండ్ చర్చలు -హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌‌లోనూ బలగాల ఉపసంహరణ!

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి సాధారణ పరిస్థితులు ఏర్పడే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ అంగీకరించిన దరిమిలా.. శుక్రవారం నాటికే తూర్పు లదాక్ లోని పాంగాంగ్‌ సరస్సుకు ఇరువైపులా బలగాల ఉపసంహరణ పూర్తయింది. ఇతర కీలక పాయింట్ల నుంచి కూడా బలగాల ఉపసంహరణ దిశగా చైనాపై భారత్ పట్టు బిగిస్తోంది. ఈ క్రమంలో...

భారత్‌, చైనా మధ్య పదో విడత కోర్‌‌ కమాండర్‌ స్థాయి చర్చలు ఆదివారం ముగిశాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న దెప్సాంగ్‌, గోగ్రాహైట్స్‌, హాట్‌స్ప్రింగ్స్‌ వద్ద బలగాల ఉపసంహరణే ప్రధాన అజెండాగా ఈ చర్చలు జరిగినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. చైనా భూభాగంలోని మాల్దో స్థావరంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పదో విడత చర్చలు ఆదివారం తెల్లవారుజామున 2గంటల వరకు కొనసాగాయి.

లదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులులదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు

At 16-hour-long talks, India, China discuss further disengagement in eastern Ladakh

10వ రౌండ్ చర్చల్లో దాదాపు 16 గంటలసేపు ఇరు దేశాల కోరు కమాండర్ల మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్‌ తరపున లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మీనన్‌, చైనా తరపున ల్యూ లిన్‌ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఇరుదేశాల సరిహద్దుల్లోని దెప్సాంగ్‌‌, హాట్‌ స్ప్రింగ్స్‌, గోగ్రా హైట్స్‌ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కొద్ది నెలల కిందటే గాల్వాన్ లోయ నుంచి వెళ్లిపోయిన ఇరు దేశాల సైన్యాలు.. తాజాగా పాంగాగ్ సరస్సు రెండు తీరాలనూ ఖాళీ చేశాయి. తాజా చర్చలు ఫలిస్తే గనుక తూర్పు లదాక్ అంతటా సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లవుతుంది. కాగా,

అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీఅసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్‌లో ఐఎస్ఎఫ్‌తో -25న ఓవైసీ ర్యాలీ

గత నెల 24వ తేదీన జ‌రిగిన 9వ ద‌ఫా క‌మాండ్ స్థాయి చ‌ర్చ‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చాయి. ఆ చ‌ర్చ‌లు ఫ‌లించ‌డంలో రెండు దేశాల సైనిక బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో ఇక హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ ప్లెయిన్స్ వంటి ప్రాంతాల్లో కూడా సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి ఆదివారం తెల్లవారుజాము దాకా జరిగిన 10వ రౌండ్ స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ ప్రాంతాల్లో చైనా అనుసరించే తీరును బట్టి 11వ రౌండ్ చర్చలపై భారత ఆర్మీ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

English summary
The tenth round of Corps commander level talks between India and China lasted for 16 hours and ended at Moldo on the Chinese side of LAC around 2 am today. As per the Army sources, both sides discussed disengagement from friction points including Gogra heights, Hot Springs and Depsang plains. This development comes after both sides completed the disengagement process from the north and south banks of Pangong Lake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X