వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video : బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా హనుమాన్ చాలీసా పఠించిన పేషెంట్...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ ఆస్పత్రిలో 24 ఏళ్ల ఓ యువతికి మెదడు భాగంలో సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. మెదడులో కణతిని తొలగించే ఈ సర్జరీ కోసం కేవలం లోకల్ ఎనస్థీషియా మాత్రమే ఇచ్చి యువతి మెలుకువలో ఉండగానే శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స జరిగిన మూడున్నర గంటల సేపు యుక్తి అగర్వాల్ అనే యువతి హనుమాన్ చాలీసా పఠించడం గమనార్హం. అంతేకాదు,సర్జరీ సమయంలో ఆమె వైద్యులతోనూ సంభాషించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డా. దీపక్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం జులై 23న ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం యుక్తి అగర్వాల్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పేషెంట్ మెలుకవలో ఉండగానే నిర్వహించే సర్జరీని 'అవేక్ క్రానియోటోమీస్'గా పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్ మెలుకువతో,అప్రమత్తంగా ఉండటం ద్వారా సర్జరీ సమయంలో మెదడులోని కీలక భాగాలకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందని చెబుతున్నారు. ఎయిమ్స్ వైద్యులు గత 20 ఏళ్లలో ఇలాంటి సర్జరీలు ఎన్నో విజయవంతంగా నిర్వహించారు.

at aiims 24 years old girl recites hanuman chalisa during brain surgery

సర్జరీ సమయంలో నొప్పి తెలియకుండా ఉండటం కోసం యువతికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.దీని ద్వారా యువతి మెదడు భాగంలో నొప్పి తెలియదని... అదే సమయంలో ఆమె స్పృహలోనే ఉంటారని తెలిపారు. యుక్తి అగర్వాల్ త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటారని చెప్పారు.

Recommended Video

Too Much Water Can Leads to Brain Swelling?? | Oneindia Telugu

గతేడాది లండన్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 53 ఏళ్ల ఓ వ్యక్తికి అక్కడి కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యులు మెదడుకు శస్త్ర నిర్వహించారు. మెదడులో కణతిని తొలగించేందుకు ఈ శస్త్ర చికిత్స నిర్వహించగా... ఆ సమయంలో సదరు పేషెంట్ వయోలిన్ వాయించడం గమనార్హం. తద్వారా ఆ సమయంలో మెదడు మరింత చురుగ్గా ఉంటుందని... ఆపరేషన్‌కు అది దోహదపడుతుందని వైద్యులు తెలిపారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వైద్యులు సైతం అవేక్ బ్రెయిన్ సర్జరీ నిర్వహించారు. రోగికి బిగ్‌బాస్ షో చూపిస్తూ వైద్యులు అతనికి సర్జరీ పూర్తి చేశారు.అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ వైద్య విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ ఇదేనని వైద్యులు చెప్తున్నారు.

English summary
A 24-year-old woman recited devotional verses of the Hanuman Chalisa while doctors at the All India Institute of Medical Sciences (AIIMS) performed a complex surgery on her brain to remove a tumour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X