పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి: ప్రధాని మోడీ

Recommended Video

    Assam Tour Of Prime Minister Narendra Modi | Oneindia Telugu

    అస్సోం: నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సోం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై మోడీ కత్తులు దువ్వారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నవివాదాస్పద అస్సోం సిటిజెన్‌షిప్ బిల్లుపై విపక్షాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. అసలు ఈ బిల్లు తీసుకురావడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో ముందుగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలన్నీ ఎంత గొప్ప పార్టీలో తెలుసని ఎద్దేవా చేశారు.

    భారత్‌లోకి చొరబడి దేశ వనరులను దోచుకునేవారికి, ఇతర దేశాల్లో మతపరమైన హింసలు ఎదుర్కొంటూ దేశంలో తలదాచుకునేందుకు వస్తున్నవారు ఎవరో ముందుగా తెలుసుకోవాలని మోడీ సూచించారు. వారిని అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని వెల్లడించారు. అన్ని విచారణలు పూర్తయిన తర్వాతే పౌరునిగా గుర్తింపుపొందుతారని అదే బిల్లులో పొందుపర్చినట్లు ప్రధాని మోడీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలు తీసుకోకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక్క అస్సోం రాష్ట్ర సమస్య కాదని యావత్ దేశం సమస్య అని చెప్పారు.

    At Assam rally, PM Modi says confusion is being created over citizenship bill

    అస్సోం వాసి అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి భూపేన్ హజారికాకు రావాల్సిన భారత రత్న విపక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విస్మరించాయో చెప్పాలన్నారు మోడీ. ఈ అంశాన్ని ప్రజలే వదిలేస్తున్నామని చెప్పిన మోడీ... అస్సోం రత్నాన్ని భారత రత్నతో ఏ ప్రభుత్వం గౌరవించిందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరారు. అంతేకాదు తాను అవినీతిపై పోరాడుతున్నందున విపక్షాలు ఏకమై తనను టార్గెట్ చేశాయాని వెల్లడించారు. దేశాన్ని దోచుకుని భారత్ విడిచి పారిపోయినవారిని తిరిగి రప్పిస్తున్నామని మోడీ సభలో చెప్పారు. ఇక మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 21శాతం అధిక నిధులు ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించామని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+