వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో ప్రధాని నోట జై శ్రీరామ్ కాదు.. జై సియారామ్: ఆసక్తికర కథనం: రెండింటి మధ్య తేడా

|
Google Oneindia TeluguNews

అయోధ్య: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా పరిశీలించిన వారికి ఓ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భూమిపూజ అనంతరం బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రసంగించారు. రామజన్మభూమి, రామమందిరం నిర్మాణ విశిష్టత గురించి ప్రస్తావించారు. చాలా అంశాలను ఆయన స్పృశించారు. అవన్నీ ఒక ఎత్తయితే.. చివరిలో ఆయన చేసిన ఓ నినాదం మరో ఎత్తు. జై శ్రీరామ్ అనే నినాదానికి బదులుగా జై సియారామ్ అని పలికారు మోడీ. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమౌతోంది.

అయోధ్య ముస్తాబు: రామమందిరం ఇలా సాక్షాత్కారం: కాలి నడకన: కాషాయమయం..జైశ్రీరామ్ నినాదాలుఅయోధ్య ముస్తాబు: రామమందిరం ఇలా సాక్షాత్కారం: కాలి నడకన: కాషాయమయం..జైశ్రీరామ్ నినాదాలు

జై శ్రీరామ్ నినాదం ఈ నాటిది కాదు..

జై శ్రీరామ్ నినాదం ఈ నాటిది కాదు..

జై శ్రీరామ్.. ఈ పదం భావోద్వేగానికి గురి చేస్తుంది. రామమందిరం నిర్మాణానికి, జై శ్రీరామ్ నినాదానికి అవినాభావ సంబంధం ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. భారతీయ జనతా పార్టీ తొలిసారిగా 1984లో రామ మందిరం నిర్మాణ ఉద్యమానికి పూనుకున్నప్పటి నుంచీ వినిపిస్తూనే వస్తోంది. జై శ్రీరామ్ అనే నినాదంతోనే బీజేపీ కురువృద్ధుడు దేశవ్యాప్తంగా రథయాత్రను నిర్వహించారు. సమగ్ర భారతావని ఈ పదాన్ని జపించేలా చేశారు. కోదండ రాముడికి అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనే ఆలోచనను రేకెత్తించారు.

జై శ్రీరామ్‌కు బదులుగా..

జై శ్రీరామ్‌కు బదులుగా..


రామమందిరం నిర్మాణ ఉద్యమానితో పెనవేసుకుని పోయిన జై శ్రీరామ్ నినాదానికి బదులుగా ప్రధానమంత్రి.. జై సియా రామ్ అని నినదించడం ఆసక్తి రేపింది. మూడున్నర దశాబ్దాల పాటు వినిపిస్తూ వచ్చిన ఈ పదానికి బదులుగా సియారామ్ అనే నినాదాన్ని ఆయన ఎందుకు వినిపించారనే అంశం మీద ఓ చర్చ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ రెండూ శ్రీరామచంద్రుడిని జపించే మంత్రాక్షరాలే అయినప్పటికీ.. తేడా ఏమిటనే విషయంపై ఆసక్తికర కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది.

జై శ్రీరామ్.. డ్రైవింగ్ ఫోర్స్..

జై శ్రీరామ్.. డ్రైవింగ్ ఫోర్స్..

జై శ్రీరామ్.. జై సియా రామ్ అనే పదాల మధ్య ఉన్న తేడా ఏమిటనేది తెవారీ మందిర్ మహంత్ గిరీష్‌పతి త్రిపాఠి తెలిపారు. జై శ్రీరామ్.. జై సియారామ్ అనే పదాల మధ్య తేడాను ఆయన విశ్లేషించారు. జై శ్రీరామ్ అనే నినాదం ఓ డ్రైవింగ్ ఫోర్స్ వంటిదని అన్నారు. ధైర్య, సాహసాలకు, దూకుడు వైఖరికి జై శ్రీరామ్ అనే నినాదం ప్రతిబింబిస్తుందని అన్నారు. శ్రీరామచంద్రుడి ఆగ్రహ స్వరూపానికి దీన్ని ప్రతీకగా భావిస్తారని చెప్పారు. యుద్ధభూమిలో జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలికితే.. ఆవేశం ఉరకలు వేస్తుందని అన్నారు.

చెడుపై దండయాత్ర కోసం

చెడుపై దండయాత్ర కోసం

చెడుపై యుద్ధం చేయడానికి సాధారణంగా ఈ పదాన్ని వినియోగిస్తుంటారని చెప్పారు. సియా రామ్ అనే పదం.. శ్రీరాముడి శాంత స్వభావాన్ని ప్రతిఫలిస్తుందని అన్నారు. సీతా సమేతుడైన అయోధ్య రాముడు ఎప్పుడూ శాంతవదనంతోనే కనిపిస్తారని అన్నారు. సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముడిని జపించాల్సి వచ్చినప్పుడు సియారామ్ అనే నామాన్ని పలుకుతారని గిరీష్‌పతి త్రిపాఠి అభిప్రాయపడ్డారు. రామమందిరాన్ని నిర్మించడం అనేది ఓ యుద్ధంలాగా సాగిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. అందుకే మోడీ..సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముడిని తలచుకుని ఉండొచ్చని అంచనా వేశారు.

సీతమ్మ తల్లిని లక్ష్మీ దేవిగా..

సీతమ్మ తల్లిని లక్ష్మీ దేవిగా..

సీతమ్మ తల్లిని లక్ష్మీదేవిగా భావిస్తారని, ఇదే విషయం హనుమాన్ చాలీసాలోనూ ప్రస్తావించారని హనుమాన్ గర్హి ఆలయ సేవక్ ఆర్‌డీ శుక్లా తెలిపారు. అష్ఠ సిద్ధి నవ నిధికే దాతా.. అసవర్ దీన్ జానకీ మాతా అనే పదాన్ని ఆ ఉద్దేశంతోనే రాశారని చెప్పారు. సీతమ్మ తల్లితో కలిపి శ్రీరాముడి పేరును ఉచ్ఛరించడమే సరైనదని అన్నారు. హిందీ బెల్ట్‌లో అధిక మంది జై సియా రామ్ అనే పదాన్నే జపిస్తారని అవధ్ యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ దీక్షిత్ తెలిపారు. సియారామ్ అనే సీతారాముడనే అర్థం వస్తుందని తెలిపారు.

English summary
By choosing to hail Lord Ram with ‘Jai Siya Ram’ instead of the popular ‘Jai Shri Ram’ after the bhoomi pujan in the Ayodhya, Prime Minister Narendra Modi left a number people curious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X