వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఉగ్రదాడుల తర్వాత భారత్ పాక్ తొలి భేటీ: పాక్ ముందు భారత్ మూడు డిమాండ్లు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడులు ఆ తర్వాత భారత్ పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధవాతారణం అనంతరం తొలిసారిగి ఇరు దేశాలా అధికారులు ఢిల్లీలో సమావేశమయ్యారు. అయితే ఇది ద్వైపాక్షిక చర్చల కోసం కాదు. కర్తాపూర్ కారిడార్‌ నిర్మాణంపై ముసాయిదా ఒప్పందం రూపొందించేందుకు పాకిస్తాన్ భారత్ అధికారులు సమావేశం అయ్యారు. పాకిస్తాన్‌లోని గురుద్వారా కర్తాపూర్ సాహిబ్ మందిరాన్ని భారత్‌లో నివసించే సిక్కులు దర్శించుకునేందుకు వీలుగా కొన్ని విధివిధానాల రూపకల్పన కోసం అధికారులు సహృదభావ వాతావరణంలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎసీఎల్ దాస్ మాట్లాడారు.

పాకిస్తాన్ ప్రభుత్వం ముందు భారత ప్రభుత్వం మూడు డిమాండ్లను ఉంచినట్లు వెల్లడించారు. ఇందులో మొదటి డిమాండ్‌గా రోజుకు భారత్ నుంచి 5వేల మంది భక్తులను గురుద్వారాను దర్శించుకునేందుకు వీలు కల్పించాలని కోరింది. అంతేకాదు ప్రత్యేక రోజుల్లో అంటే గురుపురాబ్, బైసాఖి పండగల రోజున 10వేల మంది గురుద్వారాను సందర్శించుకునేలా వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేసింది. అంతేకాదు భక్తులకు ఎలాంటి వీసా లేకుండానే గురుద్వారాను సందర్శించేలా అనుమతి ఇవ్వాలని కోరింది. అంతేకాదు పాదయాత్రగా కూడా భక్తులు గురుద్వారాను దర్శించుకునేలా వెసులుబాటు కల్పించాలని ఇందుకు తగ్గ అన్ని భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

నెహ్రూ నుంచి రాజీవ్ వరకు: సిక్కులను అణిచివేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్నెహ్రూ నుంచి రాజీవ్ వరకు: సిక్కులను అణిచివేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్

At cordial Kartarpur talks, India seeks visa-free entry for pilgrims to Pak

ఇక వారం ఏడురోజుల్లో గురుద్వారాను తెరిచే ఉంచాలనే ప్రతిపాదన పాక్ బృందం ముందు భారత్ ఉంచింది. భారత్ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తిరిగి మరోసారి సమావేశమైనప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తెలుపుతామని ఆదేశ బృందం తెలిపింది. ఇదిలా ఉంటే వచ్చే సమావేశం ఏప్రిల్ 2, 2019న వాఘాలో ఉంటుందని తెలిపారు. మరోవైపు కర్తాపూర్ కారిడార్ నిర్మాణం కోసం ఇరుదేశాలకు సంబంధించిన సాంకేతిక నిపుణులు మార్చి 19న భేటీ అవుతారని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

English summary
The first meeting between India and Pakistan experts to discuss the modalities and draft agreement for facilitation of pilgrims to visit Gurdwara Kartarpur Sahib was held today in a “cordial environment”.Addressing a media briefing after the talks got over, home ministry joint secretary SCL Das, said that the government had placed three demands before the Pakistani delegation.Among the three demands was that Pakistan allow at least 5,000 pilgrims to visit to the Gurdwara on a daily basis
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X