వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోల్‌కత్తాలో కూలిన వంతెన: 14 మంది మృతి, నెంబర్లివే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కోల్‌కత్తాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఉత్తర కోల్‌కత్తాలోని గిరీశ్ పార్క్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ప్లైఓవర్ హఠాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. మృతదేహాలను శిథిలాల కింద నుంచి వెలికితీస్తున్నారు. శిథిలాల కింద సుమారు 150 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నివారణ బృందం, ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోల్‌కత్తా మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

At least 10 killed as under construction flyover collapses in north kolkata

ఇప్పటికే రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు గ్యాస్‌ కట్టర్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా సిమెంటు, కాంక్రీట్‌ను బుధవారం రాత్రి వేశారని, అయితే ఈ రోజు అది కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షి రమేశ్ కేజ్రీవాల్ తెలిపారు.

నిర్మాణంలో ప్లైఓవర్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం ఉత్తర కోల్‌కత్తాలో జన సామర్థ్యం అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యంతర ఇరుకైన ప్రదేశం. ప్లైఓవర్ కూలిన సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్లైఓవర్ కూలడంతో కింద ఉన్న కార్లు, ఆటోలు నుజ్జునుజ్జు అయ్యాయి.

At least 10 killed as under construction flyover collapses in north kolkata

గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ ప్లైఓవర్‌కు వివేకానంద ప్లైఓవర్‌గా స్థానికులు పిలుచుకుంటున్నారు. ఎందుకంటే బుర్రాబజార్‌కు సమీపంలో నిర్మిస్తున్న ఈ ప్లైఓవర్ నిత్యం రద్దీగా ఉంటే వివేకానంద రోడ్డు వద్ద కూలిపోయింది. కోల్‌కత్తాలో బాగా ప్రాచుర్యం పొందిన గణేష్ టాకీస్‌ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది.

ప్లైఓవర్ కింద వాహనాలు వెళుతున్న సమయంలో కాంక్రీట్ దిమ్మలు అమాంతం వాహనాలపై పడటంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే కోల్‌కత్తాలోనే పొడవైనదిగా గుర్తింపును పొందనుంది. గిరిష్ పార్క్‌ను హౌరాను ఈ ప్లై ఓవర్ కలపనుంది.

సహాయక చర్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయలుపాలైనవారికి రూ.1 లక్ష పరిహారం చెల్లించనున్నట్లు మమత తెలిపారు. అలాగే గాయపడినవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందించాలని ఆమె ఆదేశించారు.

ఘటనా స్థలం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్స్: 1070, 033-22143526/ 033-22535185/ 033-22145664 Fax: 033-22141378.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సంతాపం

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డీజీతో మాట్లాడానని పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన ట్వీట్‌ చేశారు.

ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత: బీజేపీ

ఈ ఘటనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ నేత కైలాశ్‌వర్గీయ అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

English summary
A flyover which was under-construction collapsed near Ganesh Talkies in Kolkata’s Girish Park Friday afternoon. Reports say at least 10 people have been killed in the incident and many people are believed to be trapped under the rubble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X