వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన గొడ: నిద్రలోనే గాల్లో కలిసిపోయిన 17 మంది ప్రాణాలు, శిథిలాలు, భారీ వర్షాలు !

|
Google Oneindia TeluguNews

పూణే: మహారాష్ట్రలోని పూణేలో గొడ కుప్పకూలడంతో 17 మంది మృతి చెంది అనేక మందికి తీవ్రగాయాలైనాయి. శనివారం వేకువ జామున జరిగిన ఈ పమాదంలో మట్టిపెళ్లలకింద అనేక మంది చిక్కుకున్నారని అధికారులు అంటున్నారు. భాదితులను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బందితో పాట రెస్క్యూ టీం రంగంలోకి దిగారు.

పూణేలోని కూంధ్వా ప్రాంతంలోని హౌసింగ్ సోసైటిలోని నివాస సముదాయం గొడ శనివారం వేకువ జామున ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సోసైటి ప్రాంతంలోని మురికివాడల్లో (స్లం)ని ఇళ్ల మీద గొడ కుప్పకూలడంతో ఘాడ నిద్రలో ఉన్న అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

At least 17 people were killed in wall collapse following rains in Pun

గొడతో పాటు సైసోటి ప్రాంతంలో పార్క్ చేసిన కార్లు సైతం మురికివాడల్లోని ఇళ్ల మీద పడంతో మృతుల సంఖ్య పెరిగిపోయింది. పూణేలో గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు నాసిరకంగా నిర్మించిన గొడ కుప్పకూలిందని అధికారులు అంటున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఒకే ప్రాంతంలో 17 మంది మృతి చెందడంతో స్థానికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నానారా అంటూ రెస్య్కూ సిబ్బంది పరిశీలిస్తున్నారు. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

English summary
At least 17 people were killed as a portion of the compound wall of a residential complex collapsed on shanties following incessant rains in Pune on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X