వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఎల్సీలో భారీ ప్రమాదం: ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు, విశాఖ ఘటన మరుసటి రోజే..

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లో బుధవారం ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కడలూరులో ఉన్న నైవేలీ లిగ్నైట్ పవర్ ప్లాంట్ యూనిట్-5లోని బాయిలర్‌లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. అగ్నిమాపక దళాలు మంటలన ఆర్పివేశాయి. ప్రమాదంలో గాయపడినవారిని హుటాహుటిన ఎన్ఎల్సీ ఆస్పత్రికి తరలించారు.

At least 5 dead, 15 injured in boiler blast at Neyveli Lignite Corporation plant at Cuddalore

ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మే నెలలో కూడా ఇదే పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నెలరోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళనకరంగా మారింది.

Recommended Video

Weather Report : హైదరాబాద్ లో చలి తీవ్రత!! చెన్నై లో తీరం దాటినా గజ తుఫాను | Oneindia Telugu

మే 7న విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన తెల్లారే మే 8న నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లో పేలుడు సంభవించింది. తాజాగా, జూన్ 30న విశాఖపట్నంలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై ఒకరు మృతి చెందారు. యాధృశ్చికంగా మరుసటి రోజే అంటే జులై 1న నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో కూడా ప్రమాదం జరగడం గమనార్హం.

English summary
At least five people were killed and 15 others injured on Wednesday in a boiler blast at a plant of the NLC India Limited in Tamil Nadu’s Cuddalore. The boiler blast took place at the plant of the NLC India Limited, formerly known as Neyveli Lignite Corporation Limited, this morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X