బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉద్యాననగరి: 11 రోజుల్లో 543 మంది పిల్లలకు కరోనా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. మరిన్ని రోజులు దీని తీవ్రత కొనసాగే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నెలాఖరులోగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారు. థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందంటూ సూచిస్తోన్నారు. ఈ హెచ్చరికలు, అంచనాలన్నీ నిజం అయ్యేలా ఉంది పరిస్థితి. ప్రత్యేకించి- ఉద్యాననగరి బెంగళూరు కరోనా వైరస్ మహమ్మారి థర్డ్‌వేవ్ ముంగిట్లో నిల్చున్నట్టే.

వినాయక చవితి నుంచి విజయదశమి దాకా పండగలన్నింటినీ బ్యాన్ చేసిన బీజేపీ సర్కార్వినాయక చవితి నుంచి విజయదశమి దాకా పండగలన్నింటినీ బ్యాన్ చేసిన బీజేపీ సర్కార్

 కళాశాలల పునరుద్ధరణ వేళ..

కళాశాలల పునరుద్ధరణ వేళ..

ఈ నెల చివరివారం నుంచి బెంగళూరులో కళాశాలలను పునరుద్ధరించాలంటూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కొత్త కేసులు వెల్లువెత్తడం ఆందోళనకరంగా మారింది. ప్రత్యేకించి- చిన్న పిల్లలు, టీనేజర్లు కరోనా వైరస్ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. థర్డ్ వేవ్‌లో ఈ మహమ్మారి పిల్లల పైనే పంజా విసురుతోందనే చేదు వాస్తవాన్ని ప్రభుత్వ లెక్కలు ప్రతిఫలింపజేస్తోన్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె తాజాగా విడుదల చేసిన గణాంకాలు కలవరం రేపుతోన్నాయి.

అప్పుడే పుట్టిన పసికందుల నుంచి..

అప్పుడే పుట్టిన పసికందుల నుంచి..

ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ మధ్యలో ఏకంగా 543 మంది చిన్న పిల్లలు, టీనేజర్లు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సున్న పసిబిడ్డలు, యుక్త వయస్సుకు వచ్చిన వారు ఇందులో ఉన్నారు. వారందరూ కోవిడ్ కేర్ సెంటర్లు, వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఎవరూ మరణించలేదు. క్రమంగా కోలుకుంటోన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఎవరూ లేరని బీబీఎంపీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేశారు.

బ్రేకప్ ఇలా..

కరోనా వైరస్ బారిన పడిన పిల్లల బ్రేకప్‌ను ఇందులో పొందుపరిచారు. అప్పుడే పుట్టిన పసికందుల నుంచి తొమ్మిదేళ్ల వయస్సున్న పిల్లలు 2109 మంది ఉన్నారు. 10 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారు 333 మంది ఉన్నారు. ఈ 543 మంది పిల్లల్లో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ముప్పు చిన్నపిల్లలపై విరుచుకుపడుతుందనే ఆందోళనలు, హెచ్చరికల మధ్య.. బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఆ వయస్సు ఉన్న వారే మహమ్మారి బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రేకప్ ఇలా..

బ్రేకప్ ఇలా..

కరోనా వైరస్ బారిన పడిన పిల్లల బ్రేకప్‌ను ఇందులో పొందుపరిచారు. అప్పుడే పుట్టిన పసికందుల నుంచి తొమ్మిదేళ్ల వయస్సున్న పిల్లలు 2109 మంది ఉన్నారు. 10 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారు 333 మంది ఉన్నారు. ఈ 543 మంది పిల్లల్లో 270 మంది బాలికలు, 273 మంది బాలురు ఉన్నారు. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ముప్పు చిన్నపిల్లలపై విరుచుకుపడుతుందనే ఆందోళనలు, హెచ్చరికల మధ్య.. బెంగళూరులో పెద్ద సంఖ్యలో ఆ వయస్సు ఉన్న వారే మహమ్మారి బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

23 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్..

23 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్..

ఈ నెల 23వ తేదీన సోమవారం నుంచి బెంగళూరులో ఉన్నత పాఠశాలలు, కళాశాలలను పునరుద్ధరించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు అన్ని విద్యాసంస్థలు, కళాశాలలను తిరిగి తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- పిల్లలపై కరోనా వైరస్ తీవ్రతపై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా ఈ దిగ్భ్రాంతికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. థర్డ్ వేవ్ దాపురించిందనే సంకేతాలను పంపించాయి.

 మూడు రాష్ట్రాల బోర్డర్లు క్లోజ్..

మూడు రాష్ట్రాల బోర్డర్లు క్లోజ్..

ఇప్పటికే కేరళలో వేల సంఖ్యలో రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతోన్నాయి. తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ థర్డ్‌వేవ్ ముంచుకుని రానుందనే సంకేతాలను పంపిస్తోన్నాయి..ఈ మూడు రాష్ట్రాలు కూడా. అక్కడ రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల తీవ్రత తమ మీద పడకుండా ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. సరిహద్దులను మూసివేసింది. మూడు నెలల పాటు ఎలాంటి పండుగలను కూడా నిర్వహించకూడదంటూ ఉత్తర్వులను జారీ చేసింది.

English summary
According to the BBMP bulletin, at least 543 children in Bengaluru in the age-group of 0-19 have tested positive between August 1 and 11. While the third wave of the Covid-19 pandemic is said to be targeting kids predominantly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X