వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైర్ యాక్సిడెంట్ : అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరికీ సీరియస్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : గుజరాత్‌లో ఓ బహుళ అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు నాలుగు, ఐదో అంతస్తుల్లో చెలరేగాయి. స్థానికి మీడియా సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా కాపాడారు. 30 మందిని రక్షించామని గుజరాత్ పోలీసులు తెలిపారు. అయితే వారిలో ఇద్దరు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని వివరించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని .. కానీ వారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

అహ్మదాబాద్‌లోని గణేశ్ భవన సముదాయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ బహుళ అంతస్తుల భవనం ఎస్‌జీ రహదారిపై ఉంది. ఈ దారి అహ్మదాబాద్‌ను గాంధీనగర్‌ను కలుపుతుంది. ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. భవనంలో పొగచూరి మంటలు వస్తున్నాయని స్థానిక మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకొన్న స్థానికులను కాపాడారు. అయితే మంటలు ఎగిసిపడటంతో .. అందులో చిక్కుకున్న వారిని తరలించేందుకు హైడ్రాలిక్ లాడర్ ఉపయోగించారు.

at residential house fire accident

ఘటనాస్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు వ్యాపించినట్టు గుర్తించి సహాయ చర్యలు చేపట్టారు. వెంటనే భవనంలోకి ప్రవేశించి దాదాపు 30 మందిని కాపాడారు. అయితే అప్పటికే పొగచూరి ఊపిరాడక స్థానికులు ఇబ్బంది పడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. వారి పరిస్థితి విషమంగానే ఉందనని డాక్టర్లు చెప్తున్నారు.

English summary
a major fire broke out at a residential building in Gujarat's Ahmedabad this afternoon. The fire broke out at the Ganesh Genesis building located in the Gota locality of Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X