వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మదర్సాలో నమాజ్‌‍తో పాటు గాయత్రీ మంత్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని పలు మదర్సాలలో పిల్లలు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాలోని మదర్సాలో ఇది కనిపిస్తుంటుంది. ఇక్కడి మదర్సాలలో రోజు అయిదువేళలా నమాజ్ వినిపిస్తారు.

దాంతో పాటు గాయంత్రీ మంత్రాన్ని చదువుతారు. ఇది పఠించేవాళ్లు ఇమ్రాన్ (5వ తరగతి), సాజిద్ (4వ తరగతి), రెహమాన్ షా (3వ తరగతి) ఉన్నారు. వీళ్లతో పాటు వందలాది మంది హిందూ, ముస్లీం విద్యార్థులు కూడా పఠిస్తారు.

At this Mandsaur Madrasa, Hindu-Muslim kids chant Gayatri mantra

మందసౌర్ జిల్లాలోని దాదాపు 128 మదర్సాలలో నమాజ్‌తో పాటు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తారు. ఈ మదర్సాలను నిదా మహిళా మండలి స్వచ్చంద సంస్థ నిర్వహిస్తోంది. దీంతో, ఇక్కడ ఇస్లాం మత విద్యతో పాటు హిందూ సనాతన ధర్మాన్ని బోధిస్తున్నారు.

ఈ మదర్సాలలో దాదాపు అయిదువేల మంది విద్యార్థులు ఉంటారు. అయితే, ఇందులో దాదాపు సగానికి పైగా హిందువులు ఉంటారు. 55 శాతం మంది విద్యార్థులు హిందువులు ఉంటారు. ఇక్కడ మదర్సాల పేర్లు కూడా సామరస్యాన్ని చాటుతాయి. ఓ మదర్సా పేరు... మదర్సా జైన్ వర్ధమాన్ పబ్లిక్ స్కూల్. మరికొన్ని... మదర్సా ఖల్సా పబ్లిక్ స్కూల్, మదర్సా నకోడా పబ్లిక్ స్కూల్.

English summary
Chants of Om Bhur Bhuva Swaha... reverberates this madrasa in poppy belt of Mandsaur district of Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X