• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు ... 50 మంది అన్నలు, వీరుడి చెల్లె పెళ్లి చేసిన జవాన్లు

|

ససరాం : తనతో పేగు తెంచుకొన్న సోదరుడు లేడు. ఆ లోటు పూడ్చలేం. కానీ పెళ్లి నిశ్చయమైంది. వివాహ క్రతువు జరుగుతుంది. ఇంతలో ఒకరు కాదు .. కాదు ఇద్దరు కాదు 50 మంది వచ్చారు. మేమున్నామని ఆ చెల్లికి భరోసానిచ్చారు. పెళ్లయ్యే వరకు ఉండి .. తన సోదరుడిలా పనలని దగ్గరుండి చేశారు. బీహర్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.

ఇదీ నేపథ్యం ..

ఇదీ నేపథ్యం ..

బీహర్‌లోని రోహ్‌తక్ జిల్లా బదిలాదిహ్ గ్రామానికి చెందిన తేజ్ నారాయణ్ సింగ్‌కు నలుగురు పిల్లలు. అందులో పెద్ద కుమారుడు జ్యోతిప్రకాశ్ నీరలా. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. అయితే కొద్దికాలంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబానికి అరణ్యరోదనే. ఈ క్రమంలో తన కూతురు వివాహం నిశ్చయమవడంతో అందరిలాగే ప్రకాశ్‌తో పనిచేసిన సిబ్బంది బాస్‌కు పత్రిక పంపించారు. సాధారణంగా ఆర్మీ పెళ్లి, ఫంక్షన్ల అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఓ వీరుడి చెల్లి పెళ్లికి ఎలాగానైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని 50 మందిని పంపించి .. వారింట్లో సంతోషం వెల్లివిరిసేలా చేసింది.

 50 మంది అన్నలు ...

50 మంది అన్నలు ...

పెళ్లికొచ్చిన ప్రకాశ్ స్నేహితులు ఆయన లేని లోటు లేకుండా చేశారు. పెళ్లి కోసం రెండురోజుల ముందే ఇంటికి చేరుకున్నారు. పెళ్లి పన్నుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లిలో వివిధ పనుల కోసం రూ.5 లక్షలు కూడా అందజేసి తమ మంచి మనసును చాటుకున్నారు. ప్రకాశ్ చేసే పనులు చేసి అబ్బురపరిచారు. వధువును కళ్యాణ మంటపానికి సాంప్రదాయ పద్ధతిలో తీసుకొచ్చారు. తర్వాత కలిసి గ్రూపు ఫోటో దిగారు. 50 మంది ఓకే ఫోటోలో పట్టాలంటే కుదరదు కానుక .. రెండువరుసల్లో కొందరు కింద కూర్చొన్నారు. చెల్లెలు శశికళ, బావ సుజిత్ కుమార్‌కు ఏ లోటు రానీయకుండా వ్యవహరించారు. సుజిత్ కూడా బెంగళూరులో లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి రైల్వేలో ఉద్యోగి .. శశికళ నేపథ్యం తెలిసి .. పెళ్లి చేసుకునేందుకు సుజిత్ ముందుకొచ్చినట్టు తెలిసింది.

ఏం జరిగిందంటే ..

ఏం జరిగిందంటే ..

జ్యోతిప్రకాశ్ నీరలా మంచి సైనికుడు. విధి నిర్వహణలో వెన్నుచూపని వీరుడు. అయితే 2017 నవంబర్ 18న ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందారు. బందిపొర వద్ద ఉగ్రవాదులతో జరిగిన భీకరపోరులు ఆసువులు బాసాడు. తన తోటి సైనికులను కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు నీరలా. లష్కరే కమాండర్ లఖ్వీ అల్లుడు ఉబేద్ అలియాస్ ఒసామా, మహమూద్ భాయి అనే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపే సమయంలో తన తోటి సైనికులను కాపాడేందుకు తూటాలకు బలయ్యారు నీరలా. శత్రువుపై పోరాడుతూనే .. సైనికులను కాపాడిన నీరలాకు సైన్యంలో అత్యున్నత పురస్కారం అశోక చక్రను భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ చేతులమీదుగా నీరలా తల్లి. మాలతీదేవి, భార్య సుష్మ సగర్వంగా అందుకున్నారు.

ఒక్క కొడుకు పోతే ....

ఒక్క కొడుకు పోతే ....

'దేశం కోసం మేం ఒక్క కుమారుడిని కోల్పోయాం. కానీ ఆ దేవుడు మాకు మరో 50 మందిని ఇచ్చారు అని నీరలా పేరెంట్స్ భావోద్వేగంతో చెప్పడం వారి దేశభక్తికి నిదర్శనం. వీరంతా తమకు ప్రేమను పంచి, గౌరవించారని కొనియాడారు. దీంతో మేం ఒంటరిగా లేమనే బాధలేదని .. సహాయం చేతులు పెట్టే ఆర్థించే పరిస్థితి రాలేదని కంట్లో నుంచి వస్తోన్న నీటిని ఆదుముకుంటూ చెప్పారు. వీరే కాదే ఈ రోజు యావత్ జాతి మా వెంట ఉంది. తమ వెన్నంటే ఉన్న వీరంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని‘ నీరలా తల్లిదండ్రులు చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shashikala had lost her brother several months ago, but when she got married a few days ago, she had 50 brothers giving her a unique bidayee from her parents’ home. The overwhelmed parents said, “We lost one son, but got 50 sons today. These sons filled us with love and respect and assured us that we are not alone and helpless. Today, the entire nation is with us. God bless you, my children.” Bridegroom Sujit Kumar of Dehri, a loco pilot in Bengaluru, and his father Uma Shankar Yadav, also a railway employee, said that they felt honoured by this match with a martyr’s family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more