• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సెక్సీ కామెంట్స్‌: క‌న్నీరు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థిని

|

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని రాజ‌కీయాల్లో క‌ర‌ప‌త్రాల యుద్ధం కొన‌సాగుతోంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం ప‌క్క‌దారి ప‌ట్టింది. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, ఆరోప‌ణ‌ల దిశ‌గా దారి మ‌ళ్లింది. రెండు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల మ‌ధ్య వ్య‌క్తిత్వ హ‌న‌నం నెల‌కొంది. ఈ వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలీవాన‌గా మారింది. ఓ మ‌హిళా అభ్య‌ర్థి బ‌హిరంగంగా క‌న్నీరు పెట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ నెల 12వ తేదీన ఆరో విడ‌త‌లో భాగంగా ఢిల్లీ ప‌రిధిలోని ఏడు లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ అభ్య‌ర్థులు, పార్టీలు ప్ర‌చార తీవ్ర‌త‌ను పెంచారు. పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు.

అసభ్యకర పదజాలం..

అసభ్యకర పదజాలం..

ఈ నేప‌థ్యంలో తూర్పు ఢిల్లీ లోక్‌స‌భ స్థానం కోసం పోటీ ప‌డుతున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మ‌ధ్య క‌ర‌ప‌త్రాల యుద్ధం ఏర్ప‌డింది. తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌స‌భకు పోటీ ప‌డుతోన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థిని ఆతిషీపై కొన్ని క‌ర‌ప‌త్రాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆతిషీని వ్య‌క్తిగ‌తంగా దూషిస్తూ, ఆమెపై ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ, అభ్యంత‌ర‌క‌ర‌మైన ప‌ద‌జాలాన్ని ఆ క‌ర‌ప‌త్రాల్లో వాడిన‌ట్లు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం అంతా బీజేపీ క‌నుస‌న్న‌ల్లోనే కొన‌సాగుతోందంటూ ఆతిషీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ ప‌డుతున్న మాజీ క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌కు తెలిసే ఇదంతా జ‌రుగుతోందంటూ ఆమె వాపోయారు.

క‌ర‌ప‌త్రాల్లో ఏముంది?

క‌ర‌ప‌త్రాల్లో ఏముంది?

తూర్పు ఢిల్లీ లోక్‌స‌భ ప‌రిధిలోని ప్రాంతాల్లో తెల్ల‌వారుజాము నుంచే ఈ క‌ర‌ప‌త్రాల పంపిణీ కొన‌సాగుతోంది. దిన‌ప‌త్రిక‌ల్లో ఉంచి ఈ క‌ర‌ప‌త్రాల‌ను పంచి పెడుతున్నారు. ఆతిషీ మ‌తాన్ని ఇందులో ప్ర‌స్తావించారు. నిజానికి ఆమె హిందువు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ క్రైస్త‌వుడిని పెళ్లాడిన ఆతిషీది మిక్స్డ్ బ్రీడ్ అని, ఆమె భ‌ర్త ప‌శు మాంసాన్ని భుజిస్తార‌ని ఈ క‌ర‌ప‌త్రాల్లో ప్ర‌స్తావ‌వించారు. ఒక ప్రాథ‌మిక పాఠ‌శాల ఉపాధ్యాయినిగా ఉన్న ఆతిషీకి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ద‌గ్గ ఆర్థిక సామ‌ర్థ్యం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? అంటూ ఆ క‌ర‌ప‌త్రాల్లు పేర్కొన్నారు.

మాట‌ల యుద్దంః

మాట‌ల యుద్దంః

క‌ర‌ప‌త్రాలు వెలువ‌డిన వెంట‌నే రాజ‌కీయంగా అగ్గి రాజుకుంది. త‌న‌పై వ్య‌క్తిత్వ దాడికి దిగ‌డం వెనుక గౌత‌మ్ గంభీర్ హ‌స్తం ఉంద‌ని, ఇదంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో కొన‌సాగుతోందంటూ ఆరోపించారు ఆతిషి. ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌య‌నీష్ సిసోడియాతో క‌లిసి విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మాట్లాడుతూ, మాట్లాడుతూనే క‌న్నీరు పెట్టుకున్నారు. ఓ స్థాయిలో ఉన్న త‌న‌పైనే బీజేపీ నాయ‌కులు ఇలా వ్య‌క్తిత్వ హ‌న‌నానికి దిగితే.. ఇక సాధార‌ణ మ‌హిళ‌ల మాటేమిటంటూ ఆమె నిప్పులు చెరిగారు. గౌత‌మ్ గంభీర్ ఇలా చేస్తాక‌ని తాను అనుకోలేద‌ని అన్నారు. రాజ‌కీయాలు ప‌క్క‌న పెడితే- ఓ క్రికెట‌ర్‌గా తాను ఆయ‌న‌ను అభిమానిస్తాన‌ని, అలాంటిది ఓ మ‌హిళ వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని తాను అనుకోలేద‌ని అన్నారు. ఆయ‌న బీజేపీలోకి చేరే ముందే గౌత‌మ్‌తో తాను మాట్లాడాన‌ని, రాజ‌కీయాల్లో ఎంట్రీపై శుభాకాంక్ష‌లు కూడా చెప్పాన‌ని అన్నారు. మంచి వ్య‌క్తులు రాజ‌కీయాల్లో రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాను గౌత‌మ్ గంభీర్‌ను ప్రోత్స‌హించాన‌ని చెప్పారు.

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొంటా: గ‌ంభీర్‌

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొంటా: గ‌ంభీర్‌

ఈ క‌ర‌ప‌త్రాల ప్ర‌చారంపై గౌత‌మ్ గంభీర్ స్పందించారు. ఈ వ్య‌వ‌హారంలో త‌న ప్ర‌మేయం లేద‌ని అన్నారు. ఉన్న‌ట్లు నిరూపిస్తే.. ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకొంటాన‌ని అన్నారు. నిరూపించలేక‌పోతే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొంటారా? అని ఆయ‌న అరవింద్ కేజ్రీవాల్‌కు స‌వాల్ విసిరారు. కేజ్రీవాల్ వంటి ముఖ్య‌మంత్రి ఉన్నందుకు తాను సిగ్గు ప‌డుతున్నాన‌ని చెప్పారు. ఓ మ‌హిళ ద్వారా త‌న‌ను అప్ర‌తిష్టపాలు చేయ‌డానికి కేజ్రీవాల్ కుట్ర ప‌న్నార‌ని విమ‌ర్శించారు. చీపురు క‌ట్ట‌తో త‌న చెడు ఆలోచ‌న‌ల‌ను దులుపుకోవాల‌ని సూచించారు.

ప్ర‌మాదంలో ప‌డ్డ ప్ర‌జాస్వామ్యం: అతి పెద్ద కుంభ‌కోణాలు..అస్సలు బాధ్యత లేని మోడీప్ర‌మాదంలో ప‌డ్డ ప్ర‌జాస్వామ్యం: అతి పెద్ద కుంభ‌కోణాలు..అస్సలు బాధ్యత లేని మోడీ

English summary
Atishi, the Aam Aadmi Party (AAP) candidate from East Delhi, broke down at a press conference today as her party accused her BJP rival Gautam Gambhir of circulating a derogatory, scurrilous pamphlet on her ahead of voting in Delhi on Sunday for the national election. "Never imagined Gautam Gambhir to stoop so low," tweeted Arvind Kejriwal.Gautam Gambhir, a celebrated former cricketer, rubbished the allegation in a series of tweets implying that AAP had concocted the allegations to win and declaring that he was "ashamed" to have a Chief Minister like Arvind Kejriwal. He said if AAP proved its accusation, he would opt out of the election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X