వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ...

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు.మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.మృతుల్లో ఎనిమిది మహిళలు ఉన్నారు. నగౌర్‌లోని బికనీర్‌-జోధ్‌పూర్‌ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమాచారం అందిన వెంటనే శ్రీ బాలాజీ పోలీస్ స్టేషన్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులంతా మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. రాజస్తాన్‌లోని రామ్‌దేవారా కర్నీ మాత ఆలయాన్ని దర్శించుకుని ఉజ్జయిని తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.

atleast 11 killed and 7 injured in rajasthan road accident pm modi announces exgratia

ప్రమాద ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని... బాధిత కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ ఘటనపై స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన... మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున అందజేస్తామన్నారు. క్షతగాత్రుల వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఈ నెల 8న ఇదే నగౌర్‌లోని కుచమన్ వద్ద కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
ఈ ఏడాది మార్చిలో హనుమాన్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు.. ప్రయాణికులతో వెళుతున్న జీపును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హనుమాన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావత్సర్-హనుమాన్‌గఢ్ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు అతివేగంగా ఢీకొనడంతో జీపు నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి.

English summary
Atleast eleven people were killed on the spot and seven others were seriously injured in a head-on collision between a car and a truck. Eight women were among the dead.Incident took place in Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X