వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లధనం ముఠా గుట్టురట్టు: 10 మంది అరెస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: నల్ల ధనాన్ని సరఫరా చేస్తున్న ముఠా గుట్టును యూపీలో ఏటీఎస్ పోలీసులు రట్టు చేశారు. పాకిస్థాన్‌తో సంబంధాలున్నా ఈ కేసులో పదిమందిని అరెస్ట్ చేసినట్టు ఉత్తర్ ప్రదేశ్ ఏటీఎస్ ఇన్స్‌పెక్టర్ జనరల్ అసిం అరుణ్ చెప్పారు.

పాకిస్థాన్‌లోని కొందరు యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన ఇద్దరు వ్యక్తులతో సంబంధాలు నెరుపుతున్నారని పోలీసులు గుర్తించారు.నకిలీ గుర్తింపు పత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరవాలని వీరిద్దరికి పాకిస్థాన్‌ నుండి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారు.

ATS busts illegal money-supply network in Lucknow

వారి సూచన మేరకే నకిలీ పత్రాలతో బ్యాంకు ఖాతాలను తెరిచి రూ.10 కోట్ల లావాదేవీలను జరిగినట్టు పోలీసులు చెప్పారు. నేపాల్, పాకిస్థాన్, ఖతార్‌ల నుండి డబ్బులను ఈ ఖాతాల్లోకి మళ్ళించారని పోలీసులు చెప్పారు.

ఇంకా ఈ వ్యవహరంలో ఎంతమంది పాత్రదారులుగా ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నట్టు పోలీసులు ప్రకటించారు.

English summary
The Anti Terrorist Squad (ATS) in Uttar Pradesh arrested 10 people on Sunday in connection with an illegal money supply network involving Pakistan nationals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X