వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తులు సీజ్: ముక్కుపిండి వసూలు చేస్తాం, ప్రభుత్వంతో గేమ్స్ ఆడుతారా ? యూపీ ఫార్ములా కర్ణాటకలో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసే సమయంలో ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసిన నిందితుల నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలా వారి ఆస్తులు రికవరీ చేస్తున్నదో అలాగే కర్ణాటకలో ఆందోళనకారుల నుంచి వారి ఆస్తులను రికవరీ చేస్తామని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. నిరసనలు వ్యక్తం చేసే సమయంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని, అలా చెయ్యాలని మీకు ఎవరు చెప్పారని రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ ఆందోళనకారులను ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను పక్కాప్లాన్ తో ధ్వంసం చేసిన వారిని వదిలిపెడితో ప్రజలు మమ్మల్ని క్షమించరని మంత్రి ఆర్. అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

భార్య బలంగా ఉంది, ఆస్తీ ఇంకా బలంగా ఉంది, బ్యాంకులో డబ్బులు, సుపారి కిల్లర్స్ తో ఫినిష్ ! పక్కింటిలో!భార్య బలంగా ఉంది, ఆస్తీ ఇంకా బలంగా ఉంది, బ్యాంకులో డబ్బులు, సుపారి కిల్లర్స్ తో ఫినిష్ ! పక్కింటిలో!

 యూపీ ప్రభుత్వం గ్రేట్

యూపీ ప్రభుత్వం గ్రేట్

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ లో ఆందోళనకారులు జరిపిన అల్లర్లలో అక్కడి ప్రభుత్వ ఆస్తులు చాలా నాశనం అయ్యాయని కర్ణాటక మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అక్కడి ప్రభుత్వం గుర్తించిదని, వారి ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ప్రయత్నిస్తున్నదని, నిజంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరైన పని చేసిందని కర్ణాటక మంత్రి ఆర్. అశోక్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాల్లో చిక్కారు, తప్పించుకోలేరు!

సీసీ కెమెరాల్లో చిక్కారు, తప్పించుకోలేరు!

మంగళూరులో ఆందోళనకారులు విధ్వంసాలు సృష్టించి అక్కడి ప్రజలను భయాందోళనలకు గురి చేశారని మంత్రి ఆర్. అశోక్ అన్నారు. నిరసనలు చేపట్టే ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, వాళ్లు ఎలా పక్కాప్లాన్ తో ప్రభుత్వ ఆస్తులను నాశనం చెయ్యడానికి ప్రయత్నించారో అక్కడి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యిందని, వారు తప్పించుకోలేరని మంత్రి ఆర్. అశోక్ చెప్పారు.

కొత్త చట్టం తెస్తాం, మీ కథ చూస్తాం

కొత్త చట్టం తెస్తాం, మీ కథ చూస్తాం

ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిని గుర్తించి వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి కర్ణాటకలో కొత్త చట్టం అమలు చెయ్యాలని హోం మంత్రికి తాము మనవి చేస్తామని రెవన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టామని మంత్రి ఆరో. అశోక్ హెచ్చరించారు.

ముక్కుపిండి వసూలు చేస్తాం

ముక్కుపిండి వసూలు చేస్తాం

మంత్రి ఆర్. అశోక్ చేసిన ప్రతిపాదనకు మరో సీనిమర్ మంత్రి సీటీ. రవి మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన వారిని గుర్తించి వారి నుంచి నగదు వసూలు చేస్తామని, మొండికేస్తే ముక్కుపిండి వసూలు చేస్తామని మంత్రి సీటీ. రవి అన్నారు. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని, ఎవ్వరినీ వదిలిపెట్టమని, ఇలాగే వారిని వదిలిస్తే ఇలాంటి వాళ్లు ఇంకా పుట్టుకొస్తారని మంత్రి సీటీ. రవి చెప్పారు.

అక్కడ ఇక్కడా బీజేపీ ప్రభుత్వాలే!

అక్కడ ఇక్కడా బీజేపీ ప్రభుత్వాలే!

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారి నుంచి ఆస్తులు రికవరీ చెయ్యడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలాగే కర్ణాటకలో ప్రభుత్వ ఆస్తులు ధ్యంసం చేసిన వారి నుంచి రికవరీలు చెయ్యాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ లో, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

English summary
Karnataka Minister R Ashok said, We should follow Uttar Pradesh model, we should take legal action against protesters who vandalize government property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X