వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిప్పులేనిదే పొగ రాదు కదా ..? ఎన్నికల సరళిపై మొదటి సారి నోరు విప్పిన సోనియా!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను బీజేపీ తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మాట్లాడారు సోనియాగాంధీ. రాయ్‌బరేలీ నుంచి మరోసారి తనను గెలిపించేందుకు కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. బ్యూమే గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులతో అంతరంగిక సోనియా మాట్లాడారు. ఈ సమావేశం గురించి మీడియాకు సమాచారం ఇవ్వలేదని .. ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

నైతికమా ?
సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సోనియా మాట్లాడినట్టు తెలిసింది. ఎన్నికల్లో జరిగింది నైతికమో .. అనైతికమో తెలుసని గుర్తుచేశారు. దేశంలో మరోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ అవలంభించిన విధానాలను మనం కళ్లారా చూశాం, కానీ దురదృష్టవశాత్తు మళ్లీ ఆ పార్టే అధికారం చేపట్టిందని పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్ానయని తెలిపారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ గురించి అనుమానాలు ఉన్నాయని .. మరోసారి ఎలక్షన్ జరిగిన తీరుపై అనుమానం తలెత్తుతుందని పేర్కొన్నారు. అంతేకాదు నిప్పు లేనిదే పొగరాదు అనే పాత సామెతను కూడా గుర్తుచేశారు సోనియాగాంధీ.

Attempts made to mislead voters’: Sonia Gandhi in her first post-poll speech

Recommended Video

22 న ఢిల్లీకి రండి - సీనియర్లకు సోనియా పిలుపు

ఎక్కడో లోపం ?
ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడిందని పరోక్షంగా విమర్శించారు సోనియాగాంధీ. అందుకోసమే దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. తమ కంచుకోట స్థానాల్లో కూడా స్వల్ప తేడాతో ఓటమి పాలవడం అనుమానం కలిగిస్తోందన్నారు. కానీ తాము ఎప్పటికీ ప్రజలతో మమేకమవుతామని తెలిపారు. ప్రజా సంక్షేమ చర్యలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

English summary
UPA chairperson Sonia Gandhi on Wednesday targeted the Bharatiya Janata Party for ‘making attempts to mislead voters’ in the 2019 Lok Sabha elections. “As all of you have seen and some of you pointed out here, attempts were made to mislead voters in 2019 Lok Sabha elections. You all and the whole country understand whether what happened (in polls) was ethical or unethical… but nothing can be more unfortunate for India than crossing all the norms to cling on to power,” said Sonia without naming the BJP while addressing people and partymen at a ‘thanksgiving’ programme at the Bhuemau guest house in Rae Bareli on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X