హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ప్రపంచంలోనే అత్యంత భారీ గజరాజు బరువు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఆగష్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశంలో ఈ గజరాజుల పరిస్థితి ఏమిటో వాటి లెక్కలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే మనిషికి ఏనుగుకు మధ్య ఎక్కువ సంఘర్షణలు చోటుచేసుకుంటున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఏటా పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మానవుడు తన స్వలాభం కోసం ఈ మూగజీవులను అంతమొందిస్తున్న ఘటనలు చూస్తున్నాం. వాటి దంతాలతో సొమ్ము చేసుకుంటున్న ఘటనలు చాలా చూశాం. ప్రభుత్వం కూడా ఏనుగులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఏనుగుల సంరక్షణకు కేంద్రం చర్యలు

ఏనుగుల సంరక్షణకు కేంద్రం చర్యలు

ఏనుగులు అంతరించిపోకుండా వాటిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఏనుగుల సంరక్షణకు సాంకేతికతను వినియోగిస్తోంది. ఏనుగులపై మనిషి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు డ్రోన్లను ప్రవేశపెడుతోంది. అంతేకాదు ఏనుగులు ఉన్న సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌లు సెన్సార్లను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రతి ఏటా ఏనుగుల దాడిలో 500 మంది మరణిస్తున్నారు.అంతేకాదు వేల సంఖ్యలో ఇళ్లులు ధ్వసం చేశాయి. అదే సమయంలో కొన్ని మిలియన్ హెక్టార్ల పంట నష్టం జరిగింది. ఇక మనుషుల దాడిలో ఏటా 100 ఏనుగులు బలవుతున్నాయి. ఏనుగుల దంతాల కోసం, మాంసం కోసం ఏనుగులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో కరెంట్ తీగలు ఉంచడం వంటివి చేస్తున్నారు. కొన్ని చోట్లా రైలు పట్టాలు దాటుతూ మృత్యువాత పడుతున్నాయి.

 60శాతం ఏనుగులు భారత్‌లోనే..

60శాతం ఏనుగులు భారత్‌లోనే..

ఏనుగులు మానవుని మధ్య సంఘర్షణ లేకుండా ఉండాలంటే మనుషుల్లో అవగాహన తీసుకురావాల్సి ఉందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు. ఏనుగుల సంరక్షణ పై ఈ సందర్భంగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. అటవీప్రాంతాల్లో సరైన ఆహారం నీళ్లు లేక మూగ జంతువులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని చెప్పిన మంత్రి... ఇప్పుడు అడవుల్లోనే ఆహారం, నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఆసియా జాతి ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా 13దేశాల్లో ఉంటే అందులో 60శాతం ఏనుగులు భారత్‌లోనే ఉన్నాయి.

Recommended Video

A Cow Sad Incident in chittoor, Andhra Pradesh

ఈ ఏనుగు బరువు ఎంతో తెలుసా..

ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యంత బరువైన ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏనుగు 8వేల కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియోను ఫ్యూచర్ ఫర్ ఎలిఫేంట్స్ అనే సంస్థ విడుదల చేయగా ఎర్న్ నాలెడ్జ్ అనే ట్విటర్ సంస్థ తమ ఖాతా ద్వారా పోస్టు చేసింది.

హైదరాబాద్ జూలో ఏనుగులకు స్పెషల్ ట్రీట్

ఇక ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాగి మరియు అన్నంతో తయారు చేసిన కేకులను అక్కడి ఏనుగులకు ఆహారంగా పెట్టడం జరిగింది. వీటితో పాటు చెరుకు, పైన్‌యాపిల్, బెల్లం, కొబ్బరిబోండాం, మరియు పచ్చగడ్డిని ఆహారంగా ఇవ్వడం జరిగింది.

English summary
August 12th marks Worlds elephants day. India has 60 percent of worlds Asiatic wild elephants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X