వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టులో పెరిగిన ద్రవ్యోల్బణం: రేటు తగ్గింపుపైనే ఆశలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం పది నెలల గరిష్టానికి చేరింది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంకు వడ్డీరేటు తగ్గించే అవకాశాలపై ఆశలు కొనసాగుతున్నాయి. గురువారం విడుదల చేసిన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.15శాతం నుంచి 3.21శాతానికి చేరుకుంది. అయితే, ఇది జులైలో ఇంతకన్నా తక్కువగా ఉంది.

ఆరోగ్యం, విద్యా ఖర్చులు పెరగడంతో గత నెల రేటు పెరిగిపోయింది. వరుసగా 13వ నెల కూడా సెంట్రల్ బ్యాంక్ లక్ష్యానికి దిగవనే ఉండిపోయింది. భారతీయ రిజర్వు బ్యాంక్ద(ఆర్బీఐ) గత నెలలో జరిపిన నాలుగవ సమావేశంలో రెపో రేటను తగ్గించింది. 110 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.40శాతంగా ఉంది.

August retail inflation rate climbs: rate cut hopes still high

అక్టోబర్-మార్చి కాలానికి ద్రవ్యోల్బణం 3.4శాతం-3.7శాతం వరకు ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. వినియోగదారుల డిమాండ్, ప్రైవేటు పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర బ్యాంక్ రేట్లను తగ్గిస్తే బాగుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆరేళ్ల కనిష్టానికి ఆర్థిక వృద్ధి రేటు పడిపోయిన నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఇలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆర్థిక వృద్ధి 5శాతంగా ఉన్న విషయం తెలిసిందే. జులై 2019లో ఉన్న ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఆగస్టు 2019లో లేదని మూడీస్ సభ్యుడు, ఐసీఆర్ఏ ప్రిన్సిపాల్ ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు. అక్టోబర్ 2019 రేటు తగ్గించే అవకాశం ఉందని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
India's retail inflation rate increased to a 10-month high in August but stayed below the central bank's 4% medium-term target, strengthening expectations that there will be another interest rate cut next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X