Aunty: ప్రియుడి మోజులో పడిన కూతురు, అర్దరాత్రి లవర్ ను ఇంటికి పిలిపించి తల్లిని కత్తితో పొడిచేసి, ఎస్కేప్ !
బెంగళూరు/ దావణగెరె: కూతురి ప్రేమకు అడ్డుపడిన మహిళ అదే కూతురు, ఆమె ప్రియుడి చేతిలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోంది. కూతురు పెద్దదై తనను బాగా చూసుకుంటుంది అని ఆశపడిన తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రియుడి వ్యామోహంలో కన్నతల్లిని కత్తితో పొడిచిన కూతురు ఆమె ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయ్యింది. తీవ్రగాయాలైన తల్లి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు తెలిపారు.
Illegal affair: ప్రియుడి కోసం మొగుడిని ఏం చేసిందంటే ?, అర్దరాత్రి హైడ్రామా, నాటకాలు, కట్ చేస్తే !

ఒకే ఊరిలో లవర్స్
కర్ణాటకలోని ధారవాడ పట్టణంలోని ఉపనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జీజాబాయి అనే మహిళ నివాసం ఉంటున్నది. జీజాబాయికి స్పూర్తి అనే కుమార్తె ఉంది. సూర్పి, కిరణ్ అనే అబ్బాయి ప్రేమించుకున్నారు. సంవత్సరం నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. స్పూర్తి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె తల్లి జీజాబాయి కూతురిని మందలించింది.

కూతురికి బుద్దిమాటలు చెప్పిన తల్లి
తన కూతురు స్పూర్తి జోలికి రాకూడదని, ఇలాగే తిరిగితే నీకు తగినబుద్ది చెబుతానని కూతురి ప్రియుడు కిరణ్ ను జీజాబాయి హెచ్చరించింది. తన ప్రేమకు తన తల్లి జీజాబాయి అడ్డుపడుతోందని కూతురు స్పూర్తి రగిలిపోయింది. నీకు ఇంకా పెళ్లి వయసు రాలేదని, నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ప్రియుడు కిరణ్ నిన్ను ఎలా పోషిస్తాడు అంటూ తల్లి జీజాబాయి ఆమె కూతురికి బుద్దిమాటలు చెప్పింది.

ప్రియుడితో ఎస్కేప్
తల్లి జీజాబాయి బుద్దిమాటలు చెప్పడం ఆమె కూతురు స్పూర్తి జీర్ణించుకోలేకపోయింది. రెండు నెలల క్రితం కిరణ్, స్పూర్తి ఇంటి నుంచిపారిపోయారు. స్పూర్తికి, కిరణ్ మైనర్లు ( మేజర్లు కావడానికి కేవలం నెల రోజులు తక్కువ వయసు) కావడంతో జీజాబాయి పోలీసు కేసు పెట్టింది. పోలీసులు కిరణ్ ను అరెస్టు చేసి నెల రోజులు బాల నేరస్తు కారగారాని తరలించి తరువాత అతన్ని జైలుకు పంపించారు.

అర్దరాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించి ?
రెండు వారాల ముందు కిరణ్ జైలు నుంచి బెయిల్ మీద విడుదల అయ్యాడు. శుక్రవారం రాత్రి జీజాబాయి భోజనం చేసి కూతురితో కలిసి నిద్రపోయింది. అర్దరాత్రి స్పూర్తి ప్రియుడు కిరణ్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. సైలెంట్ గా ఇంటి డోర్ లాక్ తీసిన స్పూర్తి ప్రియుడు కిరణ్ ను ఇంట్లోకి పిలిపించుకుంది. తరువాత కత్తి తీసుకున్న కిరణ్ ప్రియురాలి తల్లి జీజాబాయిని పొడిచేశాడు.

ఐసీయూలో తల్లి..... కిలాడీ కూతురు జంప్
జీజాబాయి గట్టిగా కేకలు వెయ్యడంతో ఆమె కూతురు స్పూర్తి, ఆమె ప్రియుడు కిరణ్ పరారైనారు. తీవ్రగాయాలైన జీజాబాయిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. కన్నతల్లి మీద ప్రియుడు కిరణ్ తో కలిసి హత్యాయత్నం చేసిన స్పూర్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.