extra aunty: భార్యతో సరసాలకు నో సిగ్నల్. రెచ్చి పోయిన ఆంటీ, అత్త కొంపకు నిప్పు పెట్టిన అల్లుడు !
లక్నో/ కాన్పూర్: భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త విరహంతో రగిలిపోయాడు. నువ్వ పక్కన లేకపోతే నాకు నిద్రపట్టడం లేదని, నువ్వు వెంటనే వచ్చేయాలని భర్త అతని భార్యకు చెప్పాడు. కొన్ని రోజుల తరువాత తాను పుట్టింటి నుంచి వస్తానని భర్తకు అతని భార్య నచ్చచెబుతూ వచ్చింది. అయితే భర్త ఫోన్ చెయ్యడంతో అతని భార్య కాకుండా అతని అత్త ఫోన్ ఎత్తింది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, సిగ్గుషరం లేదా, నీకు రాసలీలలు మీద ఉండే ద్యాస డబ్బులు సంపాధించడంలో లేదని, నా కూతురిని పంపించనని, నీకు దిక్కున్నచోటు చెప్పుకో అంటూ అత్త బూతులు తిట్టింది. నా పెళ్లంతో సరసాలు ఆడటానికి పిలిస్తే నీకెందుకే అంత టెక్కు అంటూ రెచ్చిపోయిన అల్లుడు అత్త కొంపుకు నిప్పంటించేశాడు. అల్లుడి దెబ్బకు అత్త ఫ్యామిలీలోని 7 మందికి మంటలు వ్యాపించి ఆసుపత్రిపాలైనారు.

నిద్రలేస్తే నేరాలు ఘోరాలు
ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కొంతకాలంగా మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, ప్రతికార దాడులతో పాటు హత్యలు, దాడులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాము.

సింహరాశి దంపతులు
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలోని రట్టురువ్వుఇట్టలి ప్రాంతంలో ముఖేష్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముఖేష్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రట్టురవ్వు ప్రాంతంలో నివాసం ఉంటున్న మనీషా అనే యువతితో ముఖేష్ కుమార్ పెళ్లి జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో అప్పట్లో మనీషా ఆమె తల్లిదండ్రులకు ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకుంది.

ఆర్థిక సమస్యలతో పుట్టింటికి
డ్రైవర్ గా పని చేస్తూ సంపాధించిన డబ్బులు భార్యను పోషించడానికి ముఖేష్ కు చాలా కష్టం అయ్యింది. ఇదే సమయంలో మనీషా గర్బవతి అయ్యింది. తాను అత్తగారింటిలో ఉంటే భర్తకు మరింత కష్టాలు ఎదురౌతాయని భయపడిన మనీషా కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల క్రితం (డిసెంబర్) మనీషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అత్త పానంలో పుడక
కాన్పు జరిగి బిడ్డకు జన్మనిచ్చిన మనీషా ఇంకా పుట్టింటిలో ఉంటున్నది. భార్య దూరంగా ఉండటంతో ముఖేష్ ఒంటరిగా ఉండలేకపోయాడు. నువ్వు నా పక్కన లేకపోతే నిద్రపట్టడం లేదని, నువ్వ త్వరగా వస్తే ఇద్దరు ముద్దులు పెట్టుకుని మురిపాల గురించి మాట్లాడుకుందామని గత 15 రోజుల నుంచి ముఖేష్ భార్యకు చెబుతున్నాడు. ఇదే సమయంలో మనీషా తల్లి శివకుమారి కూతురు దగ్గర ఫోన్ లాక్కొని అల్లుడి విషయంలో పానకంలో పుడకలాగా తయారైయ్యింది.

అత్తకు ఏం పనిపాట లేదు
రెండు రోజుల క్రితం ముఖేష్ భార్య మనీషాకు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని చెప్పాడు. ఆ సందర్బంలో కూతురు మనీషా దగ్గర మొబైల్ ఫోన్ లాక్కొన్న అత్త శివకుమార్ అల్లుడు ముఖేష్ పై మండిపడింది. నీకు ఎప్పుడు చూసినా భార్యతో సరసాలు ఆడాలనే అశ ఎక్కవ అయ్యిందని, సరసాలు ఆడటానికి ఉండే టైమ్ డబ్బులు సంపాధించడానికి లేదని శివకుమారి ఆమె అల్లుడి ముఖేష్ మీద మండిపడింది.

అత్త కొంప అంటించిన అల్లుడు
తన భార్య మనీషా కాపురానికి రాకుండా ఆమె తల్లి శివకుమారి అడ్డుపడుతోందని ముఖేష్ రగిలిపోయాడు. రాత్రి భార్య మనీషాతో పాటు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారు. నేరుగా భార్య మనీషా ఇంటికి వెళ్లిన ముఖేష్ అత్త శివకెమారి మీద కోపంతో ఆమె ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో భార్య మనీషా, ఆమె తల్లిదండ్రులు హీరాలాల్, శివకుమారి, సోదరీమణులు వందన, ఉమా, రాధాతో పాటు మొత్తం 7మంది అత్తదెబ్బకు ఆసుప్రతిలో చికిత్స పొందుతన్నారు. అత్త కొంపకు నిప్పంటించిన అల్లుడు ముఖేష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.