చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Aunty: నెలకు రూ. 3 లక్షలు ఆధాయం, అదిరిపోయే ఆంటీ, చిత్తూరు, హైదరాబాద్ లో ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ హైదరాబాద్/ చిత్తూరు: అదిరిపోయే ఆంటీని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ కేటుగాడు ఆమెకు చిత్తూరు చింతకాయ తినిపించాడు. ఫేమస్ మ్యాట్రిమోనియల్ లో ఆంటీని పరిచయం చేసుకున్న వ్యక్తి నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీ కొడుకును బాగా చూసుకుంటానని, నేను నెలకు రూ. 3 లక్షలు సంపాధిస్తున్నానని నమ్మించాడు. అంతే ఆంటీకి స్మార్ట్ ఫోన్, బంగారం తీసిచ్చాడు. నమ్మకంగా ఉన్న కిలాడీని నమ్మిన ఆంటీ అతనికి రూ. 10 లక్షలు ఇచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న కిలాడీ హైదరాబాద్ లో మకాం వేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చెయ్యగా వాళ్ల దిమ్మతిరిగిపోయింది.

Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !Wife: నా మొగుడు పచ్చి కామాంధుడు, నేను తట్టుకోలేను, కోడిపులుసు టెక్నిక్‌తో చంపేసిన భార్య !

విడాకులు తీసుకున్న ఆంటీ

విడాకులు తీసుకున్న ఆంటీ

చెన్నైలోని సైదాపేటకు చెందిన 40 ఏళ్ల రమ్యశ్రీకి (పేరు మార్చడం జరిగింది)కి వివాహం జరిగింది. రమ్యశ్రీకి 13 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. నిత్యం రమ్యశ్రీకి, ఆమె భర్తకు గొడవలు జరగడంతో ఇద్దరు కోర్టులో విడాకులు తీసుకున్నారు. భర్తకు దూరంగా కొడుకుతో కలిసి రమ్యశ్రీ నివాసం ఉంటోంది.

రెండో పెళ్లి కోసం ఆంటీ తహతహ

రెండో పెళ్లి కోసం ఆంటీ తహతహ

రెండో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చెయ్యాలని రమ్యశ్రీ నిర్ణయించింది. మంచి ఆస్తులు ఉన్న రమ్యశ్రీ చూడటానికి ఎర్రగా, బుర్రగా, బలంగా ఉంటుంది. ఫేమస్ మ్యాట్రిమోనియల్ లో పేరు రిజిస్టర్ చేయించుకున్న రమ్యశ్రీ రెండో పెళ్లి కోసం వరుడుని వెతకడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి కొందరితో రమ్యశ్రీ పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ వచ్చింది.

హాయ్.... నా పేరు మనోహరన్

హాయ్.... నా పేరు మనోహరన్

రమ్యశ్రీ పెళ్లి కొడుకు కోసం వెతుకుతున్న సమయంలో హాయ్ నాపేరు మనోహరన్ అంటూ రమ్యశ్రీ జీవితంలోకి ఓ కిలాడీ కేటుగాడు ఎంట్రీ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో నేను ఉంటున్నానని, నేను నా భార్యతో విడాకులు తీసుకున్నానని,నేను సొంతంగా వ్యాపారం చేస్తున్నానని, నెలకు మూడు లక్షల రూపాయలు సంపాధిస్తున్నానని మనోహరన్ రమ్యశ్రీని నమ్మించాడు,

మస్త్ మజా..... స్మార్ట్ ఫోన్... ఉంగరాలు

మస్త్ మజా..... స్మార్ట్ ఫోన్... ఉంగరాలు

రమ్యశ్రీని పరిచయం చేసుకున్న మనోహరన్ ఆమెకు తియ్యటి మాటలు చెప్పాడు. నీకు నా బహుమతులు అంటూ ఓ స్మార్ట్ ఫోన్, బంగారు ఉంగరాలు రమ్యశ్రీకి తీసిచ్చాడు. మనోహరన్ ను మాయమాటు నమ్మిన రమ్యశ్రీ అతన్ని వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాంది. అప్పటి నుంచి రమ్యశ్రీ, మనోహరన్ మస్త్ మజా చేస్తూ వచ్చారు.

రూ. 10 లక్షలు స్వాహా... ఫోన్ స్విచ్ ఆఫ్

రూ. 10 లక్షలు స్వాహా... ఫోన్ స్విచ్ ఆఫ్

ఆంటీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉందని తెలుసుకున్న మనోహరన్ తనకు వ్యాపారంలో కొంచెం ఇబ్బంది వచ్చిందని, ఆర్థిక సహాయం చెయ్యాలని నమ్మించాడు. కాబోయే భర్త, డబ్బులు ఇస్తే బాగా సంపాధించి తనను బాగా చూసుకుంటాడనని నమ్మిన రమ్యశ్రీ మనోహరన్ అడిగనప్పుడు వాయిదాల్లో రూ. 10 లక్షలు అతనికి ఇచ్చింది. కొన్ని నెలల తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన మనోహరన్ మాయం అయిపోయాడు.

ఆంటీకి చిత్తూరు చింతకాయ

ఆంటీకి చిత్తూరు చింతకాయ

మనోహరన్ ఆచూకి తెలీకపోవడంతో మోసం జరిగిందని తెలుసుకున్న రమ్యశ్రీ చెన్నై డిప్యూటీ పోలీసు కమిషనర్ ఆఫీసులో కేసు పెట్టింది. మనోహరన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు అడ్రస్ కు వెళ్లిన చెన్నై పోలీసులు షాక్ అయ్యారు. మనోహరన్ ఇచ్చింది తప్పు అడ్రస్ అని, అతను చిత్తూరులో లేడని, నువ్వు మోసపోయావని చెన్నై పోలీసులు రమ్యశ్రీకి చెప్పారు.

 హైదరాబాద్ లో పెళ్లాం.... పిల్లలు

హైదరాబాద్ లో పెళ్లాం.... పిల్లలు

భర్త లేడని, తనకు ఆధాయం వచ్చే మార్గాలు ఏమీ లేవని, దయచేసి రూ. 10 లక్షలు వసూలు చేయించాలని రమ్యశ్రీ చెన్నై పోలీసులకు మనవి చేశారు. రంగంలోకి దిగిన చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు మనోహరన్ ఇంతకు ముందు ఉపయోగించిన ఫోన్ నెంబర్ ఆధారంగా ఆరా తీశారు. మనోడు హైదరాబాద్ లో మకాం వేశాడని గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జల్సా చేస్తున్న మనోహరన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అందరికి పంగనామాలు

అందరికి పంగనామాలు

హైదరాబద్ నుంచి మనోహరన్ ను పట్టుకుని వెళ్లి చెన్నై కోర్టులో హాజరుపరిచారు. ఇంతకు ముందు సుమారు 50 మంది మహిళలను పెళ్లి చేసుకుంటానని మనోహరన్ ఇలాగే మోసం చేశాడని, వారి దగ్గర చిక్కినకాడికి డబ్బులు లాక్కొన్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి పేరుతో మనోహరన్ ఇంకా ఎంతమంది మహిళలను ఇలా మోసం చేశాడు ? అంటూ చెన్నై పోలీసులు అతని హిస్టరీ మొత్తం బయటకు లాగుతున్నారు.

English summary
Aunty: Chennai police arrested a person who cheated Rs. 10 lakh from the woman who registered for the famous matrimonial for remarriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X