• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

lover: ఆంటీ ఆన్ లైన్ లవ్ స్టోరీ, భర్త విదేశాల్లో, ఇంట్లో ఎంజాయ్, ఫిగర్ చూసి మోసపోయి, పాపం !

|

చెన్నై/సేలం/మదురై: ఆన్ లైన్ ఆంటీ లవ్ స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. ఆన్ లైన్ లో పరిచయం అయిన యువతి, యువకుడు దగ్గర అయ్యారు. తాను కాలేజ్ లో చదువుతున్నానని ఆ అమ్మాయి ప్రియుడికి చెప్పింది. ఎర్రగా, సన్నగా, నాజూకుగా హీరోయిన్ లాగా అదిరిపోయే ఫిగర్ కావడంతో యువకుడు సోల్లు కార్చుకున్నాడు. కొంతకాలం ఆన్ లైన్ లో లవర్ తో కలిసి ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. ఆన్ లైన్ లో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు డిసైడ్ అయ్యాడు. తాళిబొట్టు, డబ్బులు జోబులు డబ్బులు పెట్టుకుని తిరిగాడు. కొన్ని రోజులు ఇద్దరూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుని ప్రియురాలి ఇంట్లోనే జల్సా చేశారు. అప్పటికే ఆ యువకుడికి షాకింగ్ విషయం తెలిసింది. నేను ప్రేమించింది కాలేజ్ అమ్మాయి, కాదు ఇద్దరు పిల్లల తల్లి, ఆమె ఆంటీ అని తెలుసుకుని ప్రియుడు తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది.

Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !

అనుభవించు రాజా

అనుభవించు రాజా

చెన్నైలోని తాంబరం సమీపంలోని సలీయూర్ ప్రాంతంలో భూపతి (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెన్నైలోని ఓ ఫేమస్ ప్రైవేట్ స్కూల్ లో భూపతి బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం తీసుకుంటున్న భూపతి స్నేహితులతో కలిసి హ్యాపీగా కాలం గడుపుతున్నాడు. అదే సమయంలో భూపతికి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైయ్యింది.

హాయ్.... నేను కాలేజ్ అమ్మాయి

హాయ్.... నేను కాలేజ్ అమ్మాయి

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని పుడపాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్న అమ్రీన్ (25) అనే ఆమె ఆన్ లైన్ లో భూపతికి పరిచయం అయ్యింది. తాను కాలేజ్ లో చదువుతున్నానని అమ్రీన్ ఆన్ లైన్ లో భూపతికి చెప్పింది. గత 8 నెలల నుంచి అమ్రీన్, భూపతి సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు.

అదిరిపోయే ఫిగర్

అదిరిపోయే ఫిగర్

ఆన్ లైన్ లో పరిచయం అయిన అమ్రీన్ చూడటానికి ఎర్రగా, సన్నగా, నాజూకుగా, హీరోయిన్ లాగా ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భూపతి డిసైడ్ అయ్యాడు. అమ్రీన్ కూడా నిన్ను ప్రేమిస్తున్నానని భూపతికి చెప్పింది. అప్పటి నుంచి ఆన్ లైన్ లో ఇద్దరూ పిచ్చపాటిగా ప్రైవేట్ విషయాలు, రాసలీలల గురించి మాట్లాడుకుంటూ కాలం గడిపారు.

 మా ఇంట్లో ఎవ్వరూ లేరు వచ్చేయ్

మా ఇంట్లో ఎవ్వరూ లేరు వచ్చేయ్

నాలుగు రోజుల క్రితం భూపతి సేలంలోని ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తాను సేలంలో ఉన్నానని భూపతి అమ్రీన్ కు ఫోన్ చేసి చెప్పాడు. తన ఇంటిలో ఎవ్వరూ లేరని, నువ్వు కచ్చితంగా రావాలని, కొన్ని రోజులు మాఇంట్లోనే ఉండాలని అమ్రీన్ భూపతికి చెప్పింది. ఎగరేసుకుంటూ తిరువణ్ణామలైలోని అమ్రీన్ ఇంటికి వెళ్లిన భూపతి షాక్ అయ్యాడు.

అమ్మాయి కాదు.... ఆంటీ

అమ్మాయి కాదు.... ఆంటీ

అమ్రీన్ ఇంటిలో ఇద్దరు పిల్లలు ఉన్న విషయం గమనించిన భూపతి ఎవరు వాళ్లు అని అడిగాడు. అప్పుడే ఆన్ లైన్ లవర్ అమ్రీన్ అసలు స్వరూపం బయటపడింది. అమ్రీన్ కు అంతుకు ముందే అజీజ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త విదేశాల్లో ఉన్నాడని భూపతికి తెలిసింది, నువ్వు నన్ను మోసం చేశావని భూపతి ఆన్ లైన్ ఆంటీ అమ్రీన్ తో గొడవపెట్టుకున్నాడు.

నా భర్త కొన్ని రోజులు రాడు....మంచి చాన్స్... నాతో !

నా భర్త కొన్ని రోజులు రాడు....మంచి చాన్స్... నాతో !

రెచ్చిపోతున్న భూపతిని అతని ప్రియురాలు కూల్ చేసింది. నా భర్త అజీజ్ ఇంకా కొన్ని రోజులు ఇంటికి రాడని, నువ్వు ఇక్కడే ఉంటూ నాతో ఎంజాయ్ చెయ్యాలని, జీవితాంతం నీన్ను సుఖపెడుతానని అమ్రీన్ అతనికి బిస్కేట్ వేసింది. పగటి పూట బయట తిరుగుతూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ గడిపేశారు. రాత్రి ఇంటికి వెళ్లిన తరువాత బెడ్ రూమ్ లో ప్రియుడు భూపతికి అమ్రీన్ స్వర్గం చూపింది.

 ఆంటీ దెబ్బకు ఔట్

ఆంటీ దెబ్బకు ఔట్

సాయంత్రం ఇంటికి అవసరం అయిన సరుకులు తీసుకుని వస్తానని, నువ్వు పిల్లలతో కలిసి ఆడుకోవాలని చెప్పిన అమ్రీన్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి ఇంటికి చేరుకుని చూడగా భూపతి ఇంటిలో చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతున్నాడని గమనించిన అమ్రీన్ పుడుపాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియుడిని చంపేసిందా ?

ప్రియుడిని చంపేసిందా ?

పోలీసులు అమ్రీన్ ఇంటిలో ఆధారాలు సేకరించారు. ఫ్యాన్ కు వేలాడుతున్న భూపతి జోబులో ఉన్న తాళిబొట్టు, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. తమ కుమారుడిని మోసం చేసి అతనితో ఎంజాయ్ చేసి తన విషయం భర్తకు తెలిసిపోతుందనే భయంతో అమ్రీన్ తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిందని భూపతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపతి ఆత్మహత్య చేసుకున్నాడా ?, అతన్ని అమ్రీన్ ఏమైనా హత్య చేసిందా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Aunty onlinelove story: Youth commits suicide after he knows that his online lover has already married and has 2 kids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X