India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: 3 ఏళ్ల క్రితం మొగుడు మృతి, కుర్రాడి దెబ్బకు ఆంటీకి కొడుకు, మరిది !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: దంపతులు సంతోషంగా కాపురం చేశారు. మూడు సంవత్సరాల క్రితం భర్త మరణించాడు. భర్త చనిపోయినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆంటీ వేరే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి కారణంగా ఆమె గర్బవతి కావడంతో బిడ్డకు జన్మనిశ్చింది. భర్త చనిపోయిన మూడు సంవత్సరాలకు నీకు బిడ్డ ఎలా పుట్టాడు ? అంటూ మరిది ఆంటీని ప్రశ్నించాడు. ఆంటీ రసవత్తరమైన మలయాళం సినిమా స్టోరీ చెప్పండంతో రగిలిపోయిన మరిది ఆమెను కొడవలితో అడ్డంగా నరికి చంపేయడం కలకలం రేపింది.

NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !NRI wife: అబ్బా.... ఎంతపని చేసింది, లాడ్జ్ లో ?, నిన్న మొగుడు, నేడు ప్రియుడు, హైటెక్ స్కెచ్ !

ఉమ్మడి కుటుంబం

ఉమ్మడి కుటుంబం

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒట్టపిదారం సమీపంలోని చింతలక్కటై గ్రామంలోని నార్త్ కాలనీలో చిన్నదురై నివాసం ఉంటున్నాడు. 18 ఏళ్ల క్రితం చిన్నదురై రామలక్ష్మి (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. చిన్నదురై, రామలక్ష్మి దంపతులు ఉమ్మడి కుటుంబంలోని కొన్ని సంవత్సరాలు కాపురం చేశారు.

భర్త చనిపోతే.... భార్య

భర్త చనిపోతే.... భార్య

మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైన చిన్నదురై చికిత్స పొందుతూ చనిపోయాడు. భర్త చిన్నదురై చనిపోయిన తరువాత రామలక్ష్మి తాను కష్టపడి ఏదైనా ఉద్యోగం చేసుకుని వేరుగా జీవిస్తానని అత్తింటిలో చెప్పింది. రామలక్ష్మి వేరుగా వెళ్లిపోవడానికి ఆమె మరిది కొంబన్ సెల్వ అప్పుడే అభ్యంతరం చెప్పాడు.

యువకుడితో టచ్ లోకి వచ్చిన ఆంటీ

యువకుడితో టచ్ లోకి వచ్చిన ఆంటీ

అత్తారింటివాళ్లు వద్దు అని చెప్పినా ఏమాత్రం లెక్క చెయ్యని రామలక్ష్మి వాళ్ల ఇంటి నుంచి వెళ్లిపోయింది. తరువాత రామలక్ష్మి ఏదో పని చేసుకుని జీవిస్తుందిని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళితే చాలు అని చిన్నదురై కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే అత్తారింటి నుంచి వెళ్లిపోయిన రామలక్ష్మి పని చేస్తున్న ప్రాంతంలో పరిచయం అయిన యువకుడితో టచ్ లోకి వెళ్లింది.

మస్త్ మజా చేసిన ఆంటీ

మస్త్ మజా చేసిన ఆంటీ


పరిచయం అయిన యువకుడితో రామలక్ష్మి చనువుగా ఉంటూ అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని మస్త్ మజా చేసింది. యువకుడి కారణంగా రామలక్ష్మీ ఆంటీ గర్బంతి అయ్యింది. గర్బవతి అయిన విషయం పుట్టింటిలో, అటు అత్తారింటి వాళ్లకు తెలీకుండా రామలక్ష్మి అనేక జాగ్రత్తలు తీసుకునింది.

వదినా......ఈ బిడ్డ ఎవరు ?

వదినా......ఈ బిడ్డ ఎవరు ?


అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడి కారణంగా తల్లి అయిన రామలక్ష్మి గుట్టుచప్పుడు కాకుండా మూడు వారాల క్రితం బిడ్డకు జన్మనిశ్చింది. రామలక్ష్మి దగ్గర పాలుతాగే పసిబిడ్డ ఉన్నాడని ఆమె అత్తారింటి వాళ్లకు తెలిసిపోయింది. విషయం తెలుసుకున్న మరిది కొంబన్ నేరుగా రామలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఈ బిడ్డ ఎవరు అని కొంబన్ అతని వదిన రామలక్ష్మిని ప్రశ్నించాడు.

 ఎదురు తిరిగిన ఆంటీ

ఎదురు తిరిగిన ఆంటీ


ఏం చెప్పాలో ముందుగానే స్కెచ్ వేసుకున్న రామలక్ష్మి ఓ మళయాలం సినిమా స్టోరీ చెప్పింది. తెలిసిన వాళ్ల బిడ్డను తాను దత్తత తీసుకుని పెంచుకోవాలని తీసుకు వచ్చానని చెప్పింది. నీకు బిడ్డను ఇచ్చిన ఆ మహాతల్లి ఎవరు అని కొంబన్ ప్రశ్నల వర్షం కురిపించాడు. నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రామలక్ష్మి ఎదురుతిరిగింది.

ఆంటీని అడ్డంగా నరికేసి ఎస్కేప్

ఆంటీని అడ్డంగా నరికేసి ఎస్కేప్

మాటామాటా పెరిగిపోవడంతో కొంబన్ సహనం కోల్పోయాడు. వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొంబన్ ఓ పదునైన కొడవలి తీసుకుని వెళ్లి రామలక్ష్మి ముఖం, మెడ, తల మీద ఇష్టం వచ్చినట్లు నరకడంతో ఇంట్లోలోనే స్పాట్ లో ఆమె ప్రాణాలు పోయాయి. రామలక్ష్మిని నరికి చంపిన కొంబన్ అక్కడి నుంచి పరారైనాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రామలక్ష్మి శవాన్ని తూత్తుకూడి జిల్లా ఆసుపత్రికి తరలించి కొంబన్ కోసం గాలిస్తున్నారు. భర్త చనిపోయిన మూడు సంవత్సరాలకు అక్రమ సంబంధం కారణంగా తల్లి అయిన రామలక్ష్మి కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

English summary
Aunty: The woman who gave birth to the child after the death of her husband. An angry Komban cuts Ramalakshmi with a scythe. In this, Ramalakshmi died on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X