Aunty: ఆంటీని చంపేసి కారులో నుంచి హైవేలో విసిరేశారు, పక్కాప్లాన్, నుజ్జునుజ్జు, సీసీటీవీల్లో షాక్ !
చెన్నై/ కోయంబత్తూరు: నిత్యం రద్దీగా వాహనాలు సంచరించే సిటీలో వేగంగా వెలుతున్న కారులో నుంచి మహిళ శవాన్ని రహదారి మీద తోసేశారు. కారులో నుంచి మహిళ శవం కిందకు విసిరేయడంతో అటువైపు వేగంగా వెళ్లిన వాహనాలు ఆమె మీద దూసుకుపోయాయి. పలు వాహనాలు ఆమె మీద దూసుకోవడంతో శరీరం నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదవశాత్తు ఆమె కారులో నుంచి కిందకు పడిపోలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కారులో నుంచి మహిళ పడిపోయి ఉంటే అదే కారులో వెలుతున్న వారు వాహనం పక్కన నిలిపి ఆమెను రక్షించడానికి ప్రయత్నించేవారు. అయితే కారులో నుంచి మహిళ రోడ్డు మీద పడిపోయిన వెంటనే ఆ కారు వేగంగా వెళ్లి పోవడం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని కారులో తిసుకు వచ్చి చెక్ పోస్టు సమీపంలోని రద్దీగా ఉండే రహదారిలో విసిరేసి అది ప్రమాదంగా చిత్రీకరించడానికి స్కెచ్ వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సమీపంలోని టోల్ ప్లాజాలో కారు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గురైన 50 ఏళ్ల మహిళ వివరాలు, అడ్రస్ ఏమాత్రం చిక్కకుండా సినిమా స్కెచ్ తో హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వేగంగా వెలుతున్న కారులో నుంచి మహిళ ఎగిరి పడుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ బయటకు రావడం కలకలం రేపింది.
Illegal
affair:
భార్య
డబుల్
కాట్
బెడ్,
లవర్
రసగుల్లా
స్వీట్,
కాళ్లు,
చేతులు,
అవయవాలు
కట్
!

రద్దీగా ఉండే సిటీ
తమిళనాడులోని కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశంలో ఎంతపేరు పొందిన కంపెనీలు ఇదే కోయంబత్తూరు నుంచి వ్యాపారాలు చేస్తున్నాయి. కోయంబత్తూరులో పగలు, రాత్రి వాహనాల సంచారంతో రద్దీగా ఉంటుంది. నిత్యం రద్దీగా ఉండే కోయంబత్తూరు జాతీయ రహదారిలో ప్రతిరోజూ కొన్ని వేల వాహనాలు సంచరిస్తుంటాయి.

కారులో నుంచి ఎగిరి కిందపడిన మహిళ శవం
నిత్యం రద్దీగా వాహనాలు సంచరించే కోయంబత్తూరు సిటీ సమీపంలోని చిన్నయ్యపాళ్యం చెక్ పోస్టు సమీపంలో వేగంగా వెలుతున్న కారులో నుంచి మహిళ శవాన్ని రద్దీగా వాహనాలు సంచరించే రహదారి మీద తోసేశారు. కారులో నుంచి మహిళ కిందకు పడిపోవడంతో అటువైపు వేగంగా వెళ్లిన వాహనాలు ఆమె మీద దూసుకుపోయాయి. పలు వాహనాలు ఆమె మీద దూసుకోవడంతో శరీరం నుజ్జు నుజ్జు అయ్యింది.

ప్రమాదం కాదు...... పక్కా స్కెచ్
ప్రమాదవశాత్తు ఆమె కారులో నుంచి కిందకు పడిపోలేదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కారులో నుంచి మహిళ పడిపోయి ఉంటే అదే కారులో వెలుతున్న వారు వాహనం పక్కన నిలిపి ఆమెను రక్షించడానికి ప్రయత్నించేవారు. అయితే కారులో నుంచి మహిళ రోడ్డు మీద పడిపోయిన వెంటనే ఆ కారు వేగంగా ముందుకు వెళ్లి పోవడం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని పోలీసులు అంటున్నారు.

ఎక్కడో చంపేసి రోడ్డు మీద విసిరేశారు ?
మహిళను వేరే ప్రాంతంలో హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని కారులో తిసుకు వచ్చి చెక్ పోస్టు సమీపంలోని రద్దీగా ఉండే రహదారిలో విసిరేసి అది ప్రమాదంగా చిత్రీకరించడానికి స్కెచ్ వేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. సమీపంలోని టోల్ ప్లాజాలో మహిళ శవం కిందకు తోసేసిన ఆ కారు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

హత్యకు గురైయ్యింది ఆంటీ
మహిళ శవం కిందకు తోసేసిన ప్రాంతం సమీపంలోని టోల్ ప్లాజాలో కారు వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గురైన 50 ఏళ్ల మహిళ వివరాలు, అడ్రస్ ఏమాత్రం చిక్కకుండా సినిమా స్కెచ్ తో హత్య చేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వేగంగా వెలుతున్న కారులో నుంచి మహిళ ఎగిరి పడుతున్న సీసీటీవీ క్లిప్పింగ్స్ బయటకు రావడం కలకలం రేపింది. అక్రమ సంబంధం కారణంగా మహిళ హత్యకు గురైయ్యిందా ?, లేదా కక్షలతో ఆమెను చంపేసి శవాన్ని రోడ్డు మీద విసిరేసి వెళ్లిపోయారా ?, లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు పోలీసులు అంటున్నారు.