Aunty: భర్తకు విడాకులు, ఇంట్లోనే ప్రియుడిని సెట్ చేసుకున్న కూతురు, ఆంటీని చంపిన కూతురి లవర్ !
బెంగళూరు/ జయనగర్: వివాహం చేసుకున్న మహిళ ఓ కూతురు ఉంది. భర్త చనిపోవడంతో కష్టపడి పని చేసిన తల్లి ఆమె కూతురిని పెంచి పోషించి ఆమెకు పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్న కూతురు ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత ఆమె భర్తను వదిలేసింది. భర్తను వదిలేసిన మహిళ పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటిలో తల్లితో కలిసి నివాసం ఉంటున్న మహిళ ఓ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. కూతురి ప్రియుడు ఆమె తల్లిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది. తన ప్రియుడు కన్న తల్లిని హత్య చేశాడని తెలిసినా ఆమె కూతురికి ఏమాత్రం బాధలేకపోవడంతో వాళ్ల బంధువులు షాక్ అయ్యారు.

భర్త చనిపోయాడు..... కష్టపడి కూతుర్ని పోషించిన తల్లి
బెంగళూరులోని గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడలపాళ్యలోని ఎస్ వీజీ ఏరియాలో నంజమ్మ (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. నంజమ్మకు రమ్యా (పేరు మార్చడం జరిగింది) అనే కూతురు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నంజమ్మ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నంజమ్మ, రమ్యా కలిసి జీవించారు.

భర్తను వదిలేసిన కూతురు
బెంగళూరులో ఇళ్లల్లో పని చేసిన నంజమ్మ ఆమె కూతురిని పెంచింది. భర్త చనిపోవడంతో కష్టపడి పని చేసిన నంజమ్మ ఆమె కూతురు రమ్యాను పెంచి పోషించి ఆమెకు పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్న రమ్యా కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత రమ్యా భర్తను వదిలేసింది.

ప్రియుడిని సెట్ చేసుకన్న కూతురు
భర్తను వదిలేసిన రమ్యా ఇద్దరు పిల్లలతో కలిసి మూడళపాళ్యాలోని పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటిలో తల్లి నంజమ్మతో కలిసి నివాసం ఉంటున్న రమ్యా గోవిందరాజనగర్ లో నివాసం ఉంటున్న రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం చేసుకుని అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది.

ప్రియురాలి ఇంట్లో సెటిల్ అయిపోయాడు
ప్రియురాలు రమ్యాను భర్త వదిలేయడం, వరుసకు అత్త అయ్యే నంజమ్మకు భర్త చనిపోవడంతో కూతురు ప్రియుడు రాఘవేంద్ర వాళ్ల ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. అపార్ట్ మెంట్స్ లోని కార్లు శుభ్రం చేస్తూ జీవనం సాగిస్తున్న రాఘవేంద్ర ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు పీకలదాక మద్యం సేవిస్తున్నాడు.

తల్లీ, కూతురికి టార్చర్
మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రాఘవేంద్ర అక్రమ సంబంధం పెట్టుకున్న రమ్యాతో పాటు ఆమె తల్లి నంజమ్మతో కూడా చనువు పెంచుకున్నాడు. రోజూ మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రాఘవేంద్ర అతని ప్రియురాలు రమ్యా తల్లి నంజమ్మకు టార్చర్ పెట్టాడు. కూతురు రమ్యా ప్రియుడు రాఘవేంద్ర రామాయణం ఎక్కువ కావడంతో నంజమ్మ అతన్ని, కూతురిని మెడపట్టి బయటకు గెంటేసింది.

నగల కోసం ప్రియురాలి తల్లిని చంపేశాడు
కొంతకాలం ప్రియురాలు రమ్యాతో బయట అద్దె ఇంటిలో ఉన్న రాఘవేంద్ర ఆమె తల్లి నంజమ్మ మీద రగిలిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నంజమ్మను దారుణంగా హత్య చేసిన రాఘవేంద్ర ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేసి మాయం అయిపోయాడు. ప్రియురాలు తల్లి నంజమ్మను హత్య చేసిన ఆమె కూతురు ప్రియుడు రాఘవేంద్ర తప్పించుకోవడంతో అతన్ని వెంటాడిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు. కూతురితో ఎంజాయ్ చేస్తున్న రాఘవేంద్ర డబ్బు, నగల కోసం నంజమ్మను హత్య చెయ్యడం కలకలం రేపింది.