వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొబైల్స్ లాగే.. వాషింగ్స్ మెషీన్స్ కూడా పేలిపోతున్నాయి!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : శామ్‌సంగ్ కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన వాషింగ్ మెషీన్స్ ను స్వచ్చందంగా వెనక్కి తిరిగి ఇచ్చేయాలని ప్రకటించింది. దీనికి కారణం.. శామ్ సంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 స్మార్ట్‌ఫోన్ల లాగే ఈ వాషింగ్ మెషీన్స్ కూడా పేలిపోయే ప్రమాదం ఉందట.

తయారీలో చోటు చేసుకున్న సాంకేతిక పొరపాటు వల్ల మెషీన్ బ్యాలెన్స్ అదుపు తప్పి ఎక్కువ వైబ్రేట్ అవడంతో పాటు పేలిపోయే ప్రమాదముందంటున్నారు కంపెనీ ప్రతినిధులు. శామ్‌సంగ్ నుంచి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ లలో ఈ పేలుడు చోటు చేసుకునే అవకాశముందని చెబుతోంది శామ్ సంగ్. కాబట్టి వీటిని స్వచ్చందంగా వెనక్కి తిరిగిచ్చేయాలని ప్రకటించింది.

Australia Unaffected By Samsung Washing Machine Recall

కాగా, ఇప్పటికే ఈ మోడల్ వాషింగ్ మెషీన్ విక్రయాలు 28లక్షలకు పైగానే జరిగాయనేది ఓ అంచనా. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన రీకాల్ ద్వారా కస్టమర్లంతా గందరగోళంలో పడ్డారు. ఇకపోతే ఈ తరహా వాషింగ్ మెషీన్ ద్వారా దుస్తులు, దుప్పట్ల వంటివి ఉతికేందుకు హైస్పీడ్ సైకిల్ సెట్టింగ్ ను మెషీన్ లో అమర్చారు. అయితే ఒక్కోసారి ఈ సెట్టింగ్ వల్ల ఏర్పడే వైబ్రేషన్స్ నియంత్రణను కోల్పోయి మెషీన్ పైభాగం ఊడిపోతుందని పలువురు కస్టమర్లు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

ఇప్పటిదాకా మొత్తం 700 కేసులు ఇలాంటివే నమోదు కాగా, అందులో పలువురు కస్టమర్లు గాయపడ్డారు కూడా. దీంతో శామ్ సంగ్ యాజమాన్యంపై కోర్టుకెక్కారు కొంతమంది కస్టమర్లు. మొత్తానికి వాషింగ్ మెషీన్స్ పేలుతున్నాయంటూ శామ్ సంగ్ కంపెనీయే ప్రకటించడంతో.. శామ్ సంగ్ ఉత్పత్తులకు ఇది పెద్ద దెబ్బలా పరిణమించనుంది.

English summary
If there's one company that can't wait until 2016 is over, it's Samsung. First, exploding phones and now, faulty washing machines. Fortunately for the latter case, it's not something we, nor Samsung Australia has to worry about, with its top-loader problems isolated to the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X