• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్లాన్ ప్రకారమే మర్డర్.. తల ఒకచోట.. మొండెం మరోచోట..!

|

హైదరాబాద్‌ : మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. జంతువులను వధించినట్లు మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. క్షణికావేశంలో కొందరు.. కక్షలతో రగిలిపోతూ మరికొందరు దారుణ హత్యలు చేస్తున్నారు. అతి క్రూరంగా చంపుతూ పగ ప్రతీకారాలు తీర్చుకుంటున్నారు. అదే క్రమంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ మర్డర్ చర్చానీయాంశంగా మారింది. తాగిన మైకంలో ఓ ఆటో డ్రైవర్‌ను పైశాచికంగా చంపిన ఘటన మియాపూర్ ప్రాంతంలో భయాందోళన రేకెత్తించింది.

మియాపూర్‌లో దారుణ హత్య.. తల, మొండెం వేరు

మియాపూర్‌లో దారుణ హత్య.. తల, మొండెం వేరు

హైదరాబాద్ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌లో దారుణ హత్య జరిగింది. 24 సంవత్సరాల వయసున్న ప్రవీణ్ అనే ఆటో డ్రైవర్‌ను అతి కిరాతకంగా చంపారు దుండగులు. తలను, మొండెంను వేరు చేసి క్రూరంగా ప్రవర్తించారు. అంతేకాదు పోలీసులకు చిక్కకుండా తలను ఓ చోట, మొండెంను మరో చోట పడేశారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

శ్రీను, శ్రీకాంత్ అనే స్నేహితులు పాత పరిచయం నేపథ్యంలో మందు తాగుదామంటూ ప్రవీణ్‌ను ఆహ్వానించారు. ఫోన్ చేసి ఫలానా చోట కలుద్దామంటూ అడ్రస్ చెప్పారు. ఆ క్రమంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ ధర్మపురి క్షేత్రం దగ్గర కలుసుకున్నారు. ఈ ముగ్గురికి మరో వ్యక్తి తోడయ్యాడు. అలా నలుగురు కలిసి ఫుల్లుగా మందేశారు.

వామ్మో, ఎలా వచ్చాడు.. విమానం ఎగిరే సమయంలో.. రన్ వే పైకి..!

మందు మత్తెక్కించాక మర్డర్ ప్లాన్ అమలు

మందు మత్తెక్కించాక మర్డర్ ప్లాన్ అమలు

మందు మత్తెక్కించాక శ్రీను, శ్రీకాంత్ తమలోని అసలు రూపం బయటపెట్టారు. పాత కక్షల నేపథ్యంలో ప్రవీణ్‌తో గొడవ పడ్డారు. పథకం ప్రకారం అతడిని హత్య చేశారు. తలను మొండెం నుంచి వేరు చేసి బొల్లారం ఏరియాలో పడేశారు. మియాపూర్‌లో డెడ్‌బాడీ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ హత్యకు కారణమైన శ్రీను, శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి ఘటనలు ఇటీవల కొకొల్లలు

ఇలాంటి ఘటనలు ఇటీవల కొకొల్లలు

ఇలాంటి దారుణ హత్యలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడానికి నేరస్థులు ఈ పద్దతిని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో వెలుగుచూస్తున్న మర్డర్లు దాదాపు ఇలాగే కనిపిస్తున్నాయి. జులై చివరి వారంలో జార్ఖండ్‌లో మూడేళ్ల చిన్నారిని ఓ నరరూప రాక్షసుడు అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపాడు. అంతటితో ఆగకుండా తలను, మొండెం వేరు చేసి పైశాచికంగా ప్రవర్తించాడు. ఇలాంటి ఉదంతాలు కొకొల్లలు.

మే నెల చివరివారంలో ఆదిలాబాద్‌‌ జిల్లాలోనూ ఇలాంటి దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని చిన్నారిని చంపి, తల మొండెం వేరు చేశారు రాక్షసులు. అనంతరం తలను ఓ సంచిలో పెట్టి రోడ్డుపై పడేశారు.

వామ్మో, ఎలా వచ్చాడు.. విమానం ఎగిరే సమయంలో.. రన్ వే పైకి..!

పోలీసులకు దొరక్కుండా ఇలాంటి ప్లాన్ వేస్తున్నారా?

పోలీసులకు దొరక్కుండా ఇలాంటి ప్లాన్ వేస్తున్నారా?

ఇటీవలి కాలంలో దారుణ హత్యలు చేస్తున్న దుండగులు తలను, మొండెంను వేరు చేస్తూ రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. అయితే పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హత్య చేశాక దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగాలంటే మొండెం ఒకటే ఉంటే సరిపోదు.. ఆ క్రమంలో తలను వేరే చోట పడేస్తే కేసును పక్కదారి పట్టించొచ్చు అనేది దుండగుల ప్లాన్‌గా కనిపిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The murder took place at the Hyderabad Miyapur Police Station Limits is very dangerous. The 24-year-old Praveen, an auto driver, was brutally killed. The head and torso separated and behaved cruelly. On arrival, the police took the body to Gandhi Hospital for postmortem. Srinu and Srikanth, who are responsible for Praveen's murder, are being detained and are being investigated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more