వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో ధరలు?: ఆటో డ్రైవర్ ఇంటికెళ్లి సారీ చెప్పిన బీజేపీ అధ్యక్షురాలు, స్వీట్లు కూడా పంచారు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: గత కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై ప్రశ్నించిన కదిర్‌ అనే ఆటోడ్రైవర్‌ను ఇటీవల బీజేపీ నేత కాళిదాస్‌ బయటికి తోసేసిన ఘటన చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళిసాయి సౌందరరాజన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే, కదిర్‌ తాగున్నాడని అందుకే గెంటేశారని తమిళిసాయి మీడియా ద్వారా వెల్లడించారు. కానీ, తన తప్పును తెలుసుకున్న తమిళిసాయి.. కదిర్‌ ఇంటికి వెళ్లి స్వీట్లు పంచి మరీ ఆయనకు క్షమాపణాలు చెప్పారు. అతని ఇంటికి వెళ్లినప్పుడు తీసిన వీడియోని తమిళిసాయి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

తమిళిసాయి తన ఇంటికి రావడంపై కదిర్ స్పందించారు. 'తమిళిసాయి మేడమ్‌ మా ఇంటికి వచ్చారు. నాపై చెయ్యి చేసుకున్న సంగతి తనకు తెలియదని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలి పదవిలో ఉన్నారు కాబట్టి పెట్రోల్‌ ధరల గురించి ప్రశ్నించానని ఆమెకు చెప్పాను. అది విని ఆమె నాకు క్షమాపణలు చెప్పారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు మేడమ్‌ చెప్పారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడంలేదని ఆమె అన్నారు' అని కదిర్ వివరించారు.

Tamilisai Soundararajan

English summary
Two days after an autorickshaw driver from Chennai was manhandled by BJP cadre for asking the party’s Tamil Nadu chief Tamilisai Soundararajan about the rising cost of fuel prices, the BJP leader has apologised to the man.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X