వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలవంతంగా బంద్, కాంగ్రెస్ కార్యకర్తల బెండ్ తీసిన ఆటో డ్రైవర్లు, 144 సెక్షన్, మహిళ!

|
Google Oneindia TeluguNews

ఉడిపి (కర్ణాటక): భారత్ బంద్ కు కర్ణాటకలోని కాంగ్రెస్-.జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బలవంతంగా బంద్ చెయ్యడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆటో డ్రైవర్లు వెంటాడి బెండ్ తీసిన ఘటన కర్ణాటకలోని ఉడిపిలో జరిగింది. ఉడిపిలో ప్రశ్నించిన మహిళ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు.

Recommended Video

భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్...!

<strong>భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్, ఆటోల్లో డబుల్ చార్జ్, లూటీ </strong>భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్, ఆటోల్లో డబుల్ చార్జ్, లూటీ

బెదిరించి బంద్

బెదిరించి బంద్

సోమవారం ఉడిపి జిల్లాధికారి కార్యాలయం ఉన్న మణిపాల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు బలవంతంగా షాప్ లు మూపించారు. వాహనాలు సంచరించకూడదని ఆదేశాలు జారీ చేశారు. మడిపాల్ లోని ఆటో స్టాండ్ దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారు.

ఇంటికి వెళ్లిపోండి

ఇంటికి వెళ్లిపోండి

ఆటోలు సంచరించడానికి వీల్లేదని, వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. బంద్ చెయ్యడానికి మీరు సొంత కార్లు, బైక్ ల్లో సంచరిస్తున్నారని, మీరుకూడా వాహనాలు నడపకుండా బంద్ నిర్వహించాలని ఆటో డ్రైవర్లు ఎదురుతిరిగారు.

రెచ్చిపోయారు

రెచ్చిపోయారు

ఆ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆటో డ్రైవర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోవడంతో ఇక లాభం లేదని నిర్ణయించిన ఆటో డ్రైవర్లు బంద్ చెయ్యడానికి వచ్చిన వారి మీద దాడి చేశారు. ఆటో డ్రైవర్లకు స్థానికులు, బీజేపీ కార్యకర్తలు మద్దతు ఇవ్వడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.

వెంటాడి దేహశుద్ది

వెంటాడి దేహశుద్ది

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆటో డ్రైవర్లు వెంటాడి దేహశుద్ది చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చచెప్పారు. బలవంతంగా షాప్ లు మూపించరాదని, వాహనాలు అడ్డుకోరాదని కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులు సూచించారు. మంగళవారం ఉదయం వరకు ఉడిపిలో 144 సెక్షన్ విధించారు.

మహిళ మీద దాడి

మహిళ మీద దాడి

ఉడిపిలోని కేఎస్ఆర్ టీసీ డిపో దగ్గర బలవంతంగా షాపులు మూపించి బంద్ చేశారు. ఓ దుకాణం నిర్వహిస్తున్న మహిళ ప్రశ్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సహనం కోల్పోయి ఆమె మీద దాడి చేశారు. స్థానికులు అడ్డుకుని ఎదురు తిరగడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి పరగుతీశారు.

English summary
Bharat Bandh: Manipal (Udupi district) auto drivers sent off Congress activists who came for forcible bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X