వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోమేషన్‌ ప్రభావం.. 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్‌!

ఆటోమేషన్‌ కారణంగా దేశీయ ఐటీ రంగంలో 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ ‘హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌’ నివేదికలో పేర్కొంది

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆటోమేషన్‌ కారణంగా దేశీయ ఐటీ రంగంలో 2022 నాటికి దాదాపు 7 లక్షల లో-స్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ 'హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌' ఒక నివేదికలో పేర్కొంది.

మీడియం-స్కిల్డ్, హై-స్కిల్డ్‌ ఉద్యోగాలు మాత్రం వరుసగా లక్ష వరకు, 1.9 లక్షల వరకూ పెరగవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు నికరంగా 7.5 శాతం తగ్గొచ్చని పేర్కొంది.

it-jobs

అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉద్యోగాల కోతకు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలను ప్రధాన కారణంగా చూపింది.

ఇక ఫిలిప్పీన్స్‌లో ఐటీ ఉద్యోగాలు స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపింది. కాగా ప్రస్తుత నేపథ్యంలో మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరమని, అప్పుడే వారు ఉద్యోగాల్లో కొనసాగగలరని అభిప్రాయపడింది.

English summary
In short, the global IT and BPO services industry employs 16 million workers today. By 2022, our industry will employ 14.8 million - a likely decrease of 7.5%* in total workers (see our research methodology below). This isn't devastating news - we'll lose this many people through natural attrition, but what this data signifies is this industry is now delivering more for less because of advantages in automation and artificial intelligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X