వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం ప్రకటనతో స్వదేశానికి భారతీయుల తాకిడి.. భారీ ట్రాఫిక్ తో వెబ్ సైట్ జామ్...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించగానే కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది. విదేశాల నుంచి కరోనా వైరస్ భారత్ లోకి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వీటిపై నిషేధం విధించింది. అయితే తాజాగా కొన్ని సడలింపులు ప్రకటిస్తున్న నేపథ్యంలో మే 7 నుంచి మే 13 వరకూ 64 ప్రత్యేక విమానాల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది.

 విదేశాల నుంచి భారత్ కు.. భారీ డిమాండ్...

విదేశాల నుంచి భారత్ కు.. భారీ డిమాండ్...


మే 7 నుంచి విదేశాల్లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు 64 ప్రత్యేక విమానాలు నడుపుతామని కేంద్రం ప్రకటించగానే .. పౌరవిమానయాన శాఖ వెబ్ సైట్ పై జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ విమానాలు ఎప్పుడు బయలుదేరబోతున్నాయి, వీటి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలనే అంశాలను తెలుసుకునేందుకు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఒక్కసారిగా ప్రయత్నించడంతో వెబ్ సైట్ క్రాష్ అయిందని పౌరవిమానయానశాఖ ప్రకటించింది. అంతరాయానికి చింతిస్తున్నామని, సమస్యను త్వరలోనే సరిదిద్గుతామని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.

ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు సర్వీసులు...

ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు సర్వీసులు...


మరోవైపు విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేందుకు టికెట్లను నేరుగా ఎయిర్ ఇండియా వెబ్ సైట్లోనే బుక్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు ఎయిర్ లైన్స్ సాయం కూడా తీసుకుని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం తాజా నిర్ణయం 40 రోజులుగా సర్వీసులను నిలిపేసిన ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్ధలకు కూడా ఊరట నిచ్చింది. కేంద్రం ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగేందుకు ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు.

విమానాలు ఎక్కడికి వస్తాయంటే...

విమానాలు ఎక్కడికి వస్తాయంటే...


మరోవైపు కేంద్రం ప్రకటించిన 64 విమానాల్లో 10 యూఏఈకి, రెండు ఖతార్ కు, ఐదు సౌదీ అరేబియాకు, ఏడు బ్రిటన్ కు, ఐదు సింగపూర్ కు, ఏడు అమెరికాకు, ఐదు ఫిలిప్పీన్స్ కు, మరో ఏడు బంగ్లాదేశ్ కు పంపాలని నిర్ణయించారు. అలాగే ఏడు దేశాల నుంచి 15 విమానాలు కేరళకు వస్తాయని, ఢిల్లీకి 11 సర్వీసులు చేరుకుంటాయని, కాశ్మీర్ కు 3, లక్నోకి ఒక సర్వీసు చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. ఈ విమానాల్లో స్వదేశాలకు వచ్చే వారంతా 14 రోజుల క్వారంటైన్ నిబంధనకు కట్టుబడి రావాల్సిందేనని కేంద్రం చెబుతోంది.

English summary
after centre's announcement to allow indians stranded in foriegn countries, huge traffic erupted on civil aviation ministry's website as a result it has been down. india will operate 64 international flights from may 7th to may 13th to bring back stranded indians from abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X