వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

who is Jharkhand next cm: హేమంత్ సోరెన్‌కే ప్రజల పట్టం, 29 శాతం ఓట్లు అని సర్వే...

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ అంచనాలను సంస్థలు లెక్కగట్టాయి. కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టబోతుందని అన్నీ సంస్థలు ఢంకా బజాయించి చెప్పాయి. ఇక సంకీర్ణ ప్రభుత్వంలో సీఎం ఎవరనే అంశంపై చర్చకు దారితీసింది. అభ్యర్థులపై యాక్సిస్ మై ఇండియా సర్వే చేపట్టింది. 29 శాతం మంది ప్రజలు హేమంత్ సోరెన్ తదుపరి సీఎం అని పేర్కొనడం విశేషం.

సోమవారం ఓట్ల లెక్కింపు..

సోమవారం ఓట్ల లెక్కింపు..

జార్ఖండ్ ఐదో విడత పోలింగ్ శుక్రవారం సాయంత్రం ముగిసింది. 16 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 71 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ నెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే బీజేపీ అధికారం కోల్పోబోతుందని ఎగ్జిట్ పోల్ అంచనాలను కమలదళం జీర్ణించుకోలేకపోతుంది. ఈ క్రమంలో యాక్సిస్ మై ఇండియా ఎవరు తదుపరి సీఎం అనే అంశంపై సర్వే చేపట్టింది. ఇందులో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్‌కు ప్రజలు పట్టం కట్టారు.

ఫస్ట్ ప్లేస్..

ఫస్ట్ ప్లేస్..

29 శాతం ఓట్లతో హేమంత్ సోరెన్ తొలి స్థానంలో నిలిచారు. తర్వాత ప్రస్తుత సీఎం రఘుబర్ దాస్ ఉన్నారు. బాబులాల్ మరాండీ 10 శాతం ఓట్లతో మూడోస్థానాన్ని సరిపెట్టుకున్నారు. ఏజేఎస్‌యూ అధినేత సుదేశ్ మహతో 9 శాతం, అర్జున్ ముండా 6 శాతం, శిబు సోరెన్‌కు కూడా 6 శాతం ప్రజలు ఓట్లు వేశారు. స్టీపెన్ మరాండి కేవలం ఒక్క శాతం, జయంత్ సిన్హా ఒక్క స్థానం, మధు కోడా ఒక్క స్థానం, సర్యు రాయ్ 1 శాతం ప్రజలు ఓటేశారు. ఇతరులు, నాకు తెలియదని 10 శాతం మంది ప్రజలు ఓటేయడం విశేషం.

మూడో స్థానంలో..

మూడో స్థానంలో..

మాజీ సీఎం బాబులాల్ మారాండికి కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చకు దారితీసింది. మూడోస్థానంలో నిలవడంతో ఆయనకు ప్రజల మద్దతు లేదనే అంశం తేలిపోయింది. మిగిలిన నేతలు, మహమహులను కూడా ప్రజలు తిరస్కరించారు. తమ తదుపరి సీఎంగా ఎంపిక చేసేందుకు ముందుకురాకపోవడం విశేషం.

English summary
the exit polls, 29 per cent of the voters favoured Hemant Soren as their chief ministerial candidate. Incumbent Chief Minister Raghubar Das got 26 per cent votes in the exit poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X