వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో ఆగస్టు 5న తలపెట్టిన రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీవీ చానెళ్ల కవరేజీ, ప్రచారాలపై ఆంక్షలు విధించారు. మతవిశ్వాసాలతో ముడిపడిన సున్నితమైన అంశం కాబట్టి భూమి పూజ సమయంలో మీడియా సంయమనం పాటించాలంటూ అయోధ్య డిప్యూటీ కలెక్టర్ మురళీధర్ సింగ్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.

 అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే.. అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..

ప్రధానంగా, రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై పిటిషన్లు వేసిన వారిని గానీ, లేదా కేసులతో సంబధమున్న ఇతర వ్యక్తులను గానీ టీవీ చర్చల్లోకి అసలే పిలవొద్దని, ప్యానెల్ డిస్కషన్ లో ఇతర మతాల విశ్వాసాలు దెబ్బతినేలా వ్యవహరించరాదని, వ్యక్తులను టార్గెట్ చేస్తూ తీవ్ర కామెంట్లు చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 5న అయోధ్య నగరంలో ఆయా టీవీ చానెళ్లు చేయబోయే అన్ని కార్యక్రమాలకు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

 Ayodhya bhoomi pujan: district administration issues curbs to TV channels

''ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేవారంతా కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. కార్యక్రమాల నిర్వహణకు ముందే అనుమతి పొందాలని టీవీ చానెళ్లకు ఆదేశించాం. అది కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తాం. పబ్లిక్ డిబేట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. ఏ మతం లేదా వ్యక్తిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీడియా జాగ్రత్త వహించాలి. కోర్టు వివాదాలున్న ఏ పక్షాన్ని కూడా చర్చకు పిలవొద్దు''అని సింగ్ పేర్కొన్నారు.

షాకింగ్:అయోధ్యలో టైమ్ క్యాప్సుల్ వట్టిదే - ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న ట్రస్ట్ - అసలేం జరిగిందంటే.. షాకింగ్:అయోధ్యలో టైమ్ క్యాప్సుల్ వట్టిదే - ఫేక్ న్యూస్ నమ్మొద్దన్న ట్రస్ట్ - అసలేం జరిగిందంటే..

Recommended Video

శ్రీరాముడు Nepal లోనే జన్మించాడు..Thori లో తవ్వకాలు చేపడుతున్న Nepal పురావస్తు శాఖ! || Oneindia

రూ.500 కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామ మందిరానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. శ్రీరామ్‌ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేస్తారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 200 మంది అతిథులు ప్రధానితో కలిసి వేడుకలో పాల్గొంటారు.

English summary
The Ayodhya district administration has told news channels that litigants in the Ayodhya land dispute case should not be part of any discussions that they broadcast from the temple town during the 'Bhumi Pujan' for the Ram temple on August 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X