వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య: రామ మందిర భూమి పూజకు అతిథులు వీరే, వేదికపై ప్రధాని మోడీతోపాటు నలుగురే

|
Google Oneindia TeluguNews

లక్నో: మరో రెండ్రోజులే సమయం ఉండటంతో అయోధ్యలో రామ మందిర భూమి పూజ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథుల ఆహ్వానం, ఇతర ఏర్పాట్లపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరాలను వెల్లడించింది. మొత్తం 175 మంది ప్రముఖులతోపాటు, 135 మంది సాధువులను, అయోధ్యకు చెందిన కొందరు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపింది.

మోడీతోపాటు ఆ నలుగురే వేదికపైన..

మోడీతోపాటు ఆ నలుగురే వేదికపైన..

కరోనా కారణంగానే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించలేకపోయామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ తోపాటు రామ జన్మభూమి న్యాస్ అధిపతి నృత్యగోపాల్ దాస్ వేదిక పంచుకుంటారని వివరించింది.

మొదట హనుమంతుని దర్శనం..

ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా హనుమాన్ మందిరాన్ని దర్శించుకుని, అక్కడ్నుంచి రామ జన్మభూమిలోని రామ్‌లల్లాలో పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపింది. కాగా, భూమి పూజ కోసం 2వేల తీర్థక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి, 100 నదుల నుంచి నీరు తెప్పించినట్లు తెలిపింది.

రామ భక్తులకు పిలుపు..

రామ భక్తులకు పిలుపు..

దేశ వ్యాప్తంగా ఉన్న అనేకమంది సాధువులు ఎన్నో రకాల పవిత్ర వస్తువులను భూమి పూజ కోసం పంపినట్లు తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెప్పింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని గ్రామాలు, నగరాల్లో భజనలు, కీర్తనలు, ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ట్రస్ట్ పిలుపునిచ్చింది. కాగా, భూమి పూజ నేపథ్యంలో పోలీసులు అయోధ్యలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

Recommended Video

Ayodhya Ram Temple Groundbreaking : అమెరికాలోని ప్రఖ్యాత Times Square లో 3D లో రామాలయ నమూనా!
రామ మందిర భూమి పూజకు వెండి తమలపాకులు

రామ మందిర భూమి పూజకు వెండి తమలపాకులు

ఇది ఇలావుండగా, రామ మందిర భూమి పూజ కోసం కాశీ నుంచి వెండి తమలపాకులు తరలివచ్చాయి. వారణాసిలోని కాశీ చౌరాసియా సంఘానికి చెందినవారు వెండితో ప్రత్యేకంగా ఐదు తమలపాకులను తయారు చేయించారు. ఆ సంఘం అధ్యక్షుడు నాగేశ్వర్ చౌరిసియా వీటిని వేద పండితులకు అందజేశారు. వారు ఈ తమలపాకులను తీసుకుని అయోధ్యకు బయల్దేరివెళ్లారు.

English summary
Two days before the grand Ram Temple ceremony at Ayodhya in Uttar Pradesh, details like the guest list and the invitation card have been unveiled. The invite mentions Prime Minister Narendra Modi and three more names, indicating a vastly trimmed list in the time of COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X