• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అయోధ్య: అది మసీదే - బాబ్రీ జిందాహై - భూమిపూజ వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

|

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న భవ్య రామ మందిరంపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాటైన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రూ. 500 కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మిస్తోన్న మందిర నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి.

  Ram Mandir Bhoomi Pujan : బాబ్రీ జిందాహై - భూమిపూజ వేళ Asaduddin Owaisi కీలక వ్యాఖ్యలు! || Oneindia

  గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనంగంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనం

  బాబ్రీ జిందాహై అంటూ..

  బాబ్రీ జిందాహై అంటూ..

  అయోధ్య భూమి పూజ నేపథ్యంలో మజ్లిస్ నేత అసదుద్దీన్ ‘‘బాబ్రీ జిందా హై'' నినాదమిచ్చారు. అదే హ్యాష్ ట్యాగ్ పై మందిరం విషయంలో తన వాణిని వినిపించారు. భవ్య రామ మందిరం కడుతోన్న చోట.. ‘‘బాబ్రీ మసీదు ఉడేది.. మసీదు ఇంకా ఉంది.. అది శాశ్వతంగా ఉండిపోతుది'' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఆయనో ట్వీట్ చేశారు. భూమి పూజ నేపథ్యంలో పలు జాతీయ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ అసద్ ఇదే అంశాన్ని వక్కాణించారు.

  నేను బతికున్నంత వరకు..

  నేను బతికున్నంత వరకు..

  ‘‘భూవివాదంపై లీగల్ అంశాల ప్రాతిపదికన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతమాత్రాన బాబ్రీ అధ్యాయం ముగిసినట్లు కాదు. కనీసం నేను బతికున్నం వరకైనా ఆ అంశం సజీవంగా ఉంటుంది. నా కుటుంబీకులతోపాటు దేశంలో న్యాయ వ్యవస్థల్ని విశ్వసించే కోట్లాది జనానికి ఒక విషయం స్పష్టంగా తెలుసు. 1992, డిసెంబర్ 6 వరకు అక్కడొక మసీదు ఉండేది. ఆ రోజు దాన్ని కూల్చేశారు. మసీదు విధ్వంసమే జరగకుంటే ఇప్పుడీ వేడుక(మందిర భూమి పూజ) ఉండకనేపోయేది'' అని ఓవైసీ అన్నారు.

  చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్

   ముసుగు తీశారు.. సంతోషం..

  ముసుగు తీశారు.. సంతోషం..

  అయోధ్యలో మందిరనిర్మాణాన్ని స్వాగతిస్తూ, రాముడు అందరి దేవుడంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కామెంట్లపై ఎంఐఎం చీఫ్ ఘాటుగా స్పందించారు. మందిర్-మసీదు అంశంలో కాంగ్రెస్‌ ఇప్పటికైనా ముసుగు తీసేసి, నటించడం మానేయడం చాలా సంతోషకరమని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్‌ హిందూత్వ భావజాలాన్ని స్వీకరించాలనుకుంటే వాళ్ల ఇష్టం. కానీ దానికి జాతీయ ఐక్యత, సాంస్కృతిక సమ్మేళనం, సోదరభావం లాంటి వ్యాఖ్యలు జోడించడం అనవసరం. చారిత్రక బాబ్రీ మసీదు కూల్చివేతలో కాంగ్రెస్ తన కృషి పట్ల ఇకపై సిగ్గుకాదు.. గర్వపడొచ్చు..''అని సెటైర్ వేశారు.

  అసద్‌కు అయోధ్య ఆహ్వానం..

  అసద్‌కు అయోధ్య ఆహ్వానం..

  నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో అయోధ్య భూమి పూజకు హాజరుకావడం రాజ్యాంగ విరుద్ధమంటూ అసదుద్దీన్ చేసిన కామెంట్లపై తెలంగాణ బీజేపీ శాఖ తీవ్ర స్థాయిలో మండిపడటం తెలిసిందే. మజ్లిస్ నేత వ్యాఖ్యలు చవకబారుగా ఉన్నాయని రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు మరో అడుగుముందుకేసి.. అయోధ్య భూమి పూజకు రావాలంటూ అసద్ కు ఆహ్వానం పంపారు. దీనిపై ఓవైసీ స్పందించలేదు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కొందరు నేరగాళ్లు నేరస్థుల సమూహం 1992లో కూల్చిచేసిన ఘటన చరిత్రలో నిలిచిపోతుందని, ఆ చోటును తాము ఎప్పటికీ మసీదుగానే భావిస్తామనే వాదనే కట్టుబడి ఉంటానని ఓవైసీ తెలిపారు.

  English summary
  AIMIM leader Asaduddin Owaisi on Wednesday said the Babri Masjid incident will not be erased from Ayodhya’s legacy. His comment came ahead of the bhoomi pujan ceremony in Ayodhya which will pave the way for construction of a grand Ram temple.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X