వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : అయోధ్య స్థల వివాదం గురువారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం
రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణ జరపనుంది. ఈ వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే వాదనలు తెరమీదకు వచ్చాయి.

ఆ క్రమంలో కేసును సత్వర విచారణకు స్వీకరించాల్సిందిగా ప్రధాన కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆయన వినతిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు విచారణకు అవసరమైన అఫిడవిట్ సమర్పించాలని సూచించింది.

ayodhya case in supreme court on thursday

మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!మొదలే కాలేదు అప్పుడే లొల్లి.. హైకోర్టుకు చేరిన ఏపీ గ్రామ వాలంటీర్ల కథ..!

రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేలా ఇదివరకు సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మహ్మద్ ఇబ్రహీం కలిఫుల్లా ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని మార్చి 8వ తేదీన ఏర్పాటు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

ఆయన అధ్యక్షతన న్యాయమూర్తి శ్రీ శ్రీ రవిశంకర్, మద్రాసు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. అదలావుంటే చర్చలు ఫలప్రదమయ్యేలా చూసేందుకు మధ్యవర్తిత్వ ప్రక్రియ వివరాలను గోప్యంగా ఉంచాలని కూడా సుప్రీంకోర్టు మధ్యవర్తుల కమిటీని అదేశించింది. వివాద పరిష్కారానికి ఆగస్టు 15 వరకూ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.

English summary
Rama Janmabhoomi and Babri Masjid Land Case once again came infront of supreme court on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X