వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya Case: మంచి విషయాన్ని ఆలస్యం చేయొద్దు: సెటిల్మెంట్ ఆఫర్‌పై వక్ఫ్‌బోర్డ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మీడియేషన్ ప్యానెల్ ద్వారా హిందూ పార్టీలతో రాజీ కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముస్లిం పార్టీలలో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డ్ స్పష్టం చేసింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో పరిష్కార మార్గం కోసం మీడియేషన్ ప్యానెల్‌ను సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే.

నివేదికను సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ అందజేసింది. మీడియేషన్ ప్యానెల్ ముందు పార్టీలు తమ వాదనను వినిపించాయని, ఆ విషయాలు ఇప్పుడే వెల్లడించలేమని సున్నీ వక్ఫ్‌బోర్డ్ స్పష్టం చేసింది. మంచి విషయాలు ఆలస్యం కాకూడదని, ఏదైనా చేయానుకులంటే ఈ సమయంలోనే చేయాలని సున్నీ వక్ఫ్‌బోర్డ్ తరపు అడ్వోకేట్ షాహిద్ రిజ్వి వ్యాఖ్యానించారు. రాజీ పడటం అనేది అన్ని వర్గాలకు మంచిదని అన్నారు.

Ayodhya case: Settlement would be win-win for all says Sunni Waqf Board

కాగా, సుప్రీంకోర్టు అయోధ్య కేసులో తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా- అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేనెల 4 నుంచి 15వ తేదీ లోపు ఎప్పుడైనా వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే నెల 17వ తేదీన గొగొయ్ పదవీ విరమణ చేయనున్నందు.. ఆ లోపే తీర్పును వెలవడించాలని చీఫ్ జస్టిస్ ఓ నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. హైడ్రామాల మధ్య అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టే బుధవారం తుది విచారణు నిర్వహించారు. విచారణ సందర్భంగా న్యాయవాదుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకోవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలో తీవ్ర రూపాన్ని ధరించిందనే విషయం స్పష్టమౌతోందని నిపుణులు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై తుది విచారణ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. వచ్చే నెల 17వ తేదీ లోపలే అయోధ్య భూ వివాదం కేసుపై తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున ఆయన తన విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయోధ్యపై 40 రోజుల పాటు చేపట్టిన విచారణ సందర్భంగా ఎదురైన అభిప్రాయాలపై చర్చించాల్సి ఉందని, విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తే.. సమయం సరిపోదని గొగొయ్ భావించినట్లు చెబుతున్నారు.

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదుకు చెందిన 2.77 ఎకరాల స్థలాన్ని ఎవరికి చెందాలనే విషయంపై దాఖలైన పిటీషన్లపై చేపట్టిన విచారణ పర్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారానికి తెర దించిన విషయం తెలిసిందే. రంజన్ గొగొయ్ సహా ఎస్ ఏ బొబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, నజీర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. నవంబర్ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగా సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై ఆయన తీర్పును వెల్లడించాల్సి ఉంది.

English summary
The lawyer for the Sunni Waqf Board, one of the Muslim parties in the politically sensitive Ayodhya land dispute case, has confirmed that a compromise offer was made to the Hindu parties through the mediation panel on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X