వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యలో రచ్చ మొదలైందా? విశ్వహిందూ పరిషత్ ఏం చేస్తోంది? మా మనోభావాలను దెబ్బతీయొద్దంటూ

|
Google Oneindia TeluguNews

అత్యంత సున్నితమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ఒకవంక సుప్రీంకోర్టు తలమునకలై ఉండగా.. మరోవంక- అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. మరో మూడు రోజుల్లో అంటే.. గురువారం నాటికి సుప్రీంకోర్టు తన విచారణ పర్వాన్ని ముగించబోతోంది. అనంతరం తుది తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అయోధ్యలో ముందు జాగ్రత్త చర్యగా 144 సెక్షన్ ను విధించింది స్థానిక జిల్లా యంత్రాంగం. డిసెంబర్ 10వ తేదీ వరకూ 144 సెక్షన్ కొనసాగుతుంది. పండుగలు, ఉత్సవాలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు.

144 సెక్షన్ ను విధించిన కొన్ని గంటల వ్యవధిలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్య డివిజినల్ కమిషనర్ మనోజ్ మిశ్రాతో భేటీ అయ్యారు. అయోధ్య సంత్ సమితి అధ్యక్షుడు మహంత్ కన్నయ్య దాస్, మహంత్ కమల్ నయన్ దాస్, మణిరామ్ దాస్ ఛాన్వీ, మహంత్ అవధ్ బిహారీ దాస్ తదితరులు అయోధ్యలోని శ్రీరామచరిత మానస్ భవన్ లో మనోజ్ మిశ్రాను కలిశారు.
ఈ నెల 27వ తేదీన దీపావళి పండుగను పురస్కరించుకుని శ్రీరామచంద్రుడి జన్మస్థలంగా భావిస్తోన్న ప్రదేశంలో దీపాలను వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఓ వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.

 VHP wants to light lamps on Diwali at Ayodhya disputed site

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మనోజ్ మిశ్రా ప్రతికూల నిర్ణయాన్ని తీసుకున్నారు. దీపాలను వెలిగించడానికి అనుమతి ఇవ్వట్లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ- రామజన్మభూమి స్థలంలో దీపాలను వెలిగిస్తే.. చట్ట విరుద్ధమౌతుందని హెచ్చరించారు. 1993లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. వివాదాస్పద రామజన్మభూమి స్థలంలో దీపాలను వెలిగించడం, పూజలను నిర్వహించడం చట్టవిరుద్ధమని వివరించారు.

 VHP wants to light lamps on Diwali at Ayodhya disputed site

రామ మందిరంలో రోజువారీ పూజలను చేయడానికి ప్రధాన అర్చకుడికి మాత్రమే అనుమతి ఉందని, ప్రత్యేక పూజలు, వేడుకలను నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 144 సెక్షన్ ను సైతం విధించడం, పండుగలను కూడా దాని పరిధిలోకి తీసుకుని వచ్చామని తెలిపారు. దీనిపై పరిషత్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను అధికారులు కించపరుస్తున్నారని ఆరోపించారు. శ్రీరామచంద్రుడి దీపాలను వెలిగించడాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. 144 సెక్షన్ ను ఉద్దేశపూరకంగానే విధించారని ఆరోపించారు.

 VHP wants to light lamps on Diwali at Ayodhya disputed site
English summary
The Vishwa Hindu Parishad (VHP)-led seers on Monday demanded that they be allowed to light “thousands of lamps” and do puja at the disputed site in Ayodhya on October 27, Diwali. Divisional Commissioner (DC) Manoj Mishra has, however, reportedly denied them permission. A delegation of seers from Ayodhya and VHP spokesperson Sharad Sharma met the DC and handed him a memorandum containing the demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X