వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపబ్లిక్ డే రోజు .. జాతీయజెండా ఎగురవేసి అయోధ్యలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం

|
Google Oneindia TeluguNews

భారతదేశ 72 వ గణతంత్ర దినోత్సవం నాడే అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో ఆలయం, అదే జిల్లాలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించి 2019 సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దీనిని నిర్మించనున్నారు. అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో ఐదు ఎకరాల స్థలంలో మసీదును నిర్మించనున్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఉదయం 8.15 గంటలకు ఈ స్థలంలో సమావేశమయ్యారు.

అయోధ్య రామాలయ స్థలంలో నదీ ప్రవాహం .. మోడల్‌ మార్చాల్సిందే.. ఐఐటీల సాయం కోరిన ట్రస్ట్అయోధ్య రామాలయ స్థలంలో నదీ ప్రవాహం .. మోడల్‌ మార్చాల్సిందే.. ఐఐటీల సాయం కోరిన ట్రస్ట్

ఐదెకరాల విస్తీర్ణంలో మసీద్ నిర్మాణ పనులకు శ్రీకారం

ఐదెకరాల విస్తీర్ణంలో మసీద్ నిర్మాణ పనులకు శ్రీకారం

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఐదెకరాల విస్తీర్ణంలో మసీద్ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ట్రస్టు సభ్యులు ప్రకటించారు . త్వరలోనే ట్రస్టు సభ్యులు అందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం మసీదు నిర్మాణం అవుతున్న ఈ గ్రామం రామాలయం నిర్మిస్తున్న రామ జన్మభూమి నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 మసీదు నిర్మాణ పనులకు సంకేతంగా మొక్కలు నాటిన ట్రస్ట్ సభ్యులు

మసీదు నిర్మాణ పనులకు సంకేతంగా మొక్కలు నాటిన ట్రస్ట్ సభ్యులు

ఈరోజు ఉదయం మసీదు ప్రాంతంలో జాతీయ జెండాను ఎగురవేసిన ట్రస్ట్ చీఫ్ జాఫర్ అహ్మద్ ఫారూకి ట్రస్ట్ యొక్క మొత్తం 12 మంది సభ్యులు మసీదు నిర్మాణానికి అధికారిక ప్రారంభానికి గుర్తుగా సైట్ వద్ద మొక్కలను నాటారు. ఐఐసిఎఫ్ ట్రస్ట్‌లోని మొత్తం 12 మంది సభ్యులు మసీదు నిర్మాణ పనుల ప్రారంభానికి గుర్తుగా ఒక్కొక్క మొక్కను నాటారు. తాము సైట్ వద్ద సాయిల్ టెస్ట్ పనిని ప్రారంభించామని, మసీదుకు సంబంధించిన సాంకేతిక పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భూ పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఇప్పటికే నిర్ణయించిన ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

మసీదు డిజైన్ ఆవిష్కరించిన ట్రస్ట్ .. భారీ గాజు గోపురంతో ఏర్పాటు

మసీదు డిజైన్ ఆవిష్కరించిన ట్రస్ట్ .. భారీ గాజు గోపురంతో ఏర్పాటు


మసీదు కోసం విరాళాలకై మేము విజ్ఞప్తి చేశామని , ప్రజలు ఇప్పటికే సహకారం అందించడం ప్రారంభించారు, అని ఫరూకి స్పష్టం చేశారు. గత నెలలో, ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసిఎఫ్) మసీదు యొక్క డిజైన్ ను ఆవిష్కరించింది. సుందరమైన తోటలో భారీ గాజు గోపురం తో సొగసైన డిజైన్ తో మసీదు నిర్మాణం జరగనుంది. మసీద్ వెనక భాగంలో అత్యాధునిక డిజైన్ తో ఆసుపత్రి భవనం నిర్మించనున్నట్లు గా ఫారూకి పేర్కొన్నారు. మసీదు పేరు ఇంకా నిర్ణయించబడలేదు, కానీ దీనికి ఏ చక్రవర్తి లేదా రాజు పేరు పెట్టబడదని ఐఐసిఎఫ్ ట్రస్ట్ మునుపటి ప్రకటనలలో పేర్కొంది.

 మసీదు వెనుక భాగంలో ఆస్పత్రి .. ట్రస్ట్ సభ్యుల వెల్లడి

మసీదు వెనుక భాగంలో ఆస్పత్రి .. ట్రస్ట్ సభ్యుల వెల్లడి


ఈ ప్రాజెక్టు మొదటి దశలో మసీదుతో పాటు ఆసుపత్రి ఉంటుంది. రెండవ దశలో ఆసుపత్రిని విస్తరించాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఈ హాస్పిటల్ కాంప్లెక్స్‌లో, ప్రతిరోజూ కనీసం 1,000 మందికి పోషకమైన భోజనం అందించే కమ్యూనిటీ కిచెన్ కూడా ఉంటుంది. ఇక్కడ వైద్య అవసరాలను అర్థం చేసుకోవడానికి మేము 25-30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఈ ప్రాంతంలో ఒక సర్వే నిర్వహించాము. ఈ ప్రాంతంలో అతి పెద్ద సమస్యగా పోషకాహార లోపం ఉన్నట్లు గుర్తించామని దీనిని తమ ఆసుపత్రి ద్వారా పరిష్కరిస్తామని ఐఐసిఎఫ్ ట్రస్ట్ కార్యదర్శి అథర్ హుస్సేన్ చెప్పారు.

English summary
Raising of the national flag on India's 72nd Republic Day and a tree plantation drive marked the formal beginning of the project to construct a mosque in dhannipur, following the landmark 2019 Supreme Court verdict over ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X